#Telangana #Telangana News #Trending

Wine Shops To Be Closed In Telangana: మందుబాబులకు చేదువార్త .. 3 రోజులు వైన్ షాపులు బంద్

మద్యం ప్రియులకు మరో షాకింగ్ వార్త. నేటి నుంచి మూడు రోజుల పాటు వైన్ షాపులు, బార్లు బంద్ కానున్నాయి. మే 27వ తారీఖున ఉమ్మడి నల్గొండ- వరంగల్- ఖమ్మం జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో లిక్కర్ షాపులు, బార్లు క్లోజ్ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది..

మందుబాబులకు మరోసారి చేదు వార్త చెప్పింది ఎన్నికల సంఘం. ఇటీవలే లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరిగిన నేపథ్యంలో తెలంగాణలో రెండు రోజుల పాటు వైన్ షాపులు, బార్లు మూతపడిన సంగతి తెలిసింది. ఇప్పుడు మరోసారి లిక్కర్ షాపులు క్లోజ్ అవ్వనున్నాయి. జూన్ 4తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఆ రోజు కూడా వైన్ షాపులు మూసేయనున్నారు. అయితే.. ఈ గ్యాప్ కూడా మరోసారి కూడా లిక్కర్ షాపులకు తాళాలు పడనున్నాయి. మే 27వ తేదీ, సోమవారం ఉమ్మడి వరంగల్- నల్గొండ- ఖమ్మం జిల్లాల పట్టభద్రుల MLC ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఆ రోజున కూడా వైన్ షాపులతో పాటు బార్లు బంద్ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

అయితే.. నల్గొండ- ఖమ్మం- వరంగల్ జిల్లా పట్టభద్రుల MLC ఎన్నికల పోలింగ్‌కు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈనెల 27న వరంగల్‌, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్లు MLC ఉపఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ క్రమంలోనే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. 27వ తేదీన వైన్ షాపులు మూసేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది.

అయితే.. మే 27న ఎన్నికల పోలింగ్ జరిగే మూడు జిల్లాల్లో మాత్రమే వైన్స్ షాపులు, బార్లను 48 గంటల పాటు బంద్ చేయనున్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో మే 25 సాయంత్రం 4 గంటల నుంచి 27న సాయంత్రం 4 గంటల వరకు లిక్కర్ షాపులు క్లోజ్ అవ్వనున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *