#Trending

 WARANGAL LOVE STORY TURNED AS TRAGEDY: విషాదాంతంగా మారిన వరంగల్ ‘లవ్ స్టోరీ’.. అసలు ఏమైందంటే?

వరంగల్‌లో ఓ ‘లవ్ స్టోరీ’ విషాదాంతంగా మారింది. తాము కలకాలం సంతోషంగా కలిసి ఉండాలనుకున్న ఓ జంట కథ అనుకోని మలుపు తీసుకుంది. ఆత్మాహత్యాయత్నం చేసుకునేదాకా..

వరంగల్‌లో (Warangal) ఓ ‘లవ్ స్టోరీ’ (Love Story) విషాదాంతంగా మారింది. తాము కలకాలం సంతోషంగా కలిసి ఉండాలనుకున్న ఓ జంట కథ అనుకోని మలుపు తీసుకుంది. ఆత్మాహత్యాయత్నం చేసుకునేదాకా వ్యవహారం వెళ్లింది. ఈ క్రమంలో యువతి మృతి చెందగా.. అబ్బాయి పరిస్థితి విషమంగా ఉంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మంకు చెందిన ఐలపోగు సుష్మా (17)కు కొంతకాలం క్రితం మేకమల్ల చెన్నకేశవులు (19) అబ్బాయితో ఓ ఫోన్ కాల్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇక అప్పటి నుంచి వీళ్లిద్దరు తరచుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అది క్రమంగా ప్రేమగా మారింది.

ప్రేమలో పడిన తర్వాత సుష్మా, చెన్నకేశవులు రెగ్యులర్‌గా కలవడం స్టార్ట్ చేశారు. తమకు నచ్చిన ప్రాంతాలకు వెళ్తూ సరదాగా గడిపారు. రానురాను వీరి ప్రేమ మరింత గాఢంగా మారింది. ఎంతలా అంటే.. ఒకరిని విడిచి మరొకరు విడిచిపెట్టలేనంత ప్రేమలో మునిగిపోయారు. దీంతో.. వాళ్లు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే.. ఇతర ప్రేమజంటల్లా పారిపోకుండా, పెద్దలను ఒప్పించి పెళ్లాడాలని అనుకున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ వెలుగు చూసింది. ఆ ఇద్దరూ తమతమ ఫ్యామిలీలకు ప్రేమ విషయం చెప్పగా.. వాళ్లు ఒప్పుకోలేదు. ఇంకా ఎదగాల్సిన వయసులో ఈ పిచ్చిపిచ్చి పనులేంటని ఇరు కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో.. ఆ ప్రేమజంట నొచ్చుకుంది.

పెద్దలు తమ ప్రేమని అంగీకరించకపోవడంతో.. ఇక తమకు పెళ్లి కాదని సుష్మా, చెన్నకేశవులు భావించారు. ఈ క్రమంలోనే వాళ్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేమనుకొని, కలిసి చనిపోదామని నిర్ణయించారు. రైలు కిందపడి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో యువతి సుష్మా చనిపోగా.. యువకుడు చెన్నకేశవుల పరిస్థితి విషమంగా ఉంది. అతనికి ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెరవెనుక ఉన్న అసలు కథేంటి? పెద్దలు అంగీకరించలేదనే వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారా? లేక ఇతర కారణం ఉందా? అనే కోణంలో విచారిస్తున్నారు

 WARANGAL LOVE STORY TURNED AS TRAGEDY: విషాదాంతంగా మారిన వరంగల్ ‘లవ్ స్టోరీ’.. అసలు ఏమైందంటే?

Wine Shops To Be Closed In Telangana:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *