#Top Stories

Heavy Rain In Dubai : దుబాయ్ లో కుంభవృష్టి, వరదలు అతలాకుతలం చేశాయి.

అత్యధిక భూభాగం ఎడారిగా ఉండే యూఏఈలో తీవ్రస్థాయిలో 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. గల్ఫ్ దేశాల్లో పచ్చదనం అన్నది అత్యంత అరుదుగా కనిపించే విషయం. అయితే గత కొన్నేళ్లుగా దుబాయ్, ఒమన్ ప్రాంతాల్లో భారీ వరదలు సంభవిస్తున్నాయి. ఏడాది సగటు వర్షపాతం 200 మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉండే ఈ ప్రాంతాల్లో కొన్ని గంటల వ్యవధిలోనే కుండపోత వానలు కురుస్తున్నాయి. తాజాగా, దుబాయ్ లో కుంభవృష్టి, వరదలు అతలాకుతలం చేశాయి.

అత్యధిక భూభాగం ఎడారిగా ఉండే యూఏఈలో తీవ్రస్థాయిలో 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. గల్ఫ్ దేశాల్లో పచ్చదనం అన్నది అత్యంత అరుదుగా కనిపించే విషయం. అయితే గత కొన్నేళ్లుగా దుబాయ్, ఒమన్ ప్రాంతాల్లో భారీ వరదలు సంభవిస్తున్నాయి.

ఏడాది సగటు వర్షపాతం 200 మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉండే ఈ ప్రాంతాల్లో కొన్ని గంటల వ్యవధిలోనే కుండపోత వానలు కురుస్తున్నాయి. తాజాగా, దుబాయ్ లో కుంభవృష్టి, వరదలు అతలాకుతలం చేశాయి. ఒక్క రోజు వ్యవధిలో 142 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఎడారి దేశాల్లో ఈ స్థాయిలో వర్ష బీభత్సానికి క్లౌడ్ సీడింగ్ కారణమని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విమానాలు, రాకెట్ల ద్వారా మేఘాల్లో రసాయనాలు చల్లి, ఆ మేఘాలు కరిగి వర్షంలా మారే ప్రక్రియనే క్లౌడ్ సీడింగ్ అంటారు.

పెరుగుతున్న జనాభాకు తగినంత నీటిని అందించడం, అత్యధిక ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచడం, భూగర్భ జలవనరులను పెంపొందించడం వంటి ఉద్దేశాలతో అరబ్ దేశాలు క్లౌడ్ సీడింగ్ ను ఆశ్రయిస్తున్నాయి.

ఇలా కృత్రిమ వర్షాలను కురిపించే ప్రయత్నంలోనే ఒక్కోసారి అతి భారీ వర్షాలు కురిసి, వరదలు పోటెత్తుతున్నాయని నిపుణులు పేర్కొన్నారు.

Heavy Rain In Dubai : దుబాయ్ లో కుంభవృష్టి, వరదలు అతలాకుతలం చేశాయి.

Ycp Candidate Rk Roja Files Nomination In

Leave a comment

Your email address will not be published. Required fields are marked *