#ANDHRA ELECTIONS #Elections

Bonda Uma: అన్యాయంగా నా పేరు వాడుతున్నారు.. బోండా ఉమా స్ట్రాంగ్ వార్నింగ్…

Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై గులకరాయి దాడి ఘటనలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమాను ఇరింకేందుకు అధికారపార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లు టీడీపీ వర్గాలకు సమాచారం అందింది. అయితే కావాలని టీడీపీ నేతలను ఇరికించేందకు యత్నిస్తున్నారంటూ ఆ పార్టీ శ్రేణులు మండిపడితున్నాయి. ఈ క్రమంలో గులకరాయి ఘటనకు సంబంధించి బొండో ఉమా స్పష్టతనిచ్చారు. సీఎంపై రాయి దాడి ఘటనకు తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు.

అమరావతి, ఏప్రిల్ 17: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై (CM Jaganmohan Reddy) గులకరాయి దాడి ఘటనలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమాను ఇరికించేందుకు అధికారపార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లు టీడీపీ (TDP) వర్గాలకు సమాచారం అందింది. అయితే కావాలని వైసీపీ (YSRCP) ఇలా చేస్తోందంటూ టీడీపీ శ్రేణులు మండిపడితున్నారు. ఈ క్రమంలో గులకరాయి ఘటనకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలపై బొండా ఉమా స్పష్టతనిచ్చారు. సీఎంపై రాయి దాడి ఘటనకు తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వ ఒత్తిడి మేరకే ఇరికించాలని చూస్తున్నారని టీడీపీ నేత ఆరోపించారు.

బుధవారం ఏబీఎన్‌ -ఆంధ్రజ్యోతి (ABN – Andhrajyothy) ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో బోండా ఉమా మాట్లాడుతూ.. ‘‘పోలీస్ అధికారులు కొంతమంది నన్ను ప్రభుత్వ ఒత్తిడి మేరకు ఇరికించాలని చూస్తున్నారు. నాకు సీఎం పై రాయి దాడి ఘటనలో ఏటువంటి సంబంధం లేదు. సీబీఐ విచారణ వేయాలని డిమండ్ చేస్తున్నా. నేను కూడా సహకరిస్తాను. వేముల దుర్గారావును తీసుకువెళ్ళి హింసించి నా పేరు చెప్పించాలని చూస్తున్నారు. అంతకుముందు వడ్డెర గూడెం పిల్లలను తీసుకువెళ్ళి హింసించారు. అందులో ఒకతను తనకు డబ్బులు ఇవ్వకపోవడం వల్లనే రాయి విసిరానని చెప్పారు’’ అని అన్నారు. కోడికత్తి డ్రామా, వివేకానంద రెడ్డి హత్య వాళ్ళే చేయించారని దర్యాప్తు సంస్థలు తేల్చాయని.. ఇప్పుడు ఎన్నికల ముందు సింపతీ కోసం గులక రాయి డ్రామా ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దుర్గారావు పార్టీ ఆఫీసులో ఉండగా…

సింపతీ రాలేదని తెలిసి టీడీపీపై నెట్టందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అన్యాయంగా ఇరికించాలని చూస్తున్నారన్నారు. వేముల దుర్గారావు తమ పార్టీ ఆఫీస్‌లో ఉండగా పట్టుకువెళ్ళారని.. అతను టీడీపీ పార్టీ ఆఫీస్ వ్యవహారాలు చూస్తారని చెప్పారు. దుర్గారావు తనకు ప్రతిరోజూ ఫోన్ చేసి పోగ్రామ్స్ చెబుతారన్నారు. కావాలంటే ఫోన్ రికార్డ్ చూసుకోవచ్చన్నారు. అన్యాయంగా ఇరికిస్తే మాత్రం జూన్ నాలుగు తరువాత ఎవరిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కాకినాడ, గుంటూరు నుంచి ఇద్దరు అధికారులను పిలిపించి తన పేరు ఇరికించాలని చూస్తున్నారన్నారు.

నా పేరు పెడితే…

ఇంటి వద్ద, పార్టీ కార్యాలయం వద్ద నిఘా పెట్టారన్నారు. ఇప్పటికే ఈ అక్రమ కేసుపై కేంద్ర ఎన్నికల కమిషన్, సీఈవో, డీజీపీలకు సమాచారం ఇచ్చామన్నారు. అలాగే రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లిన్నట్లు చెప్పారు. వెల్లంపల్లి, సజ్జల రామకృష్ణా రెడ్డి తనను ఇరికించాలని ఒత్తిడి తెస్తున్నారని సమాచారం వచ్చిందన్నారు. అన్యాయంగా తన పేరు పెడితే మాత్రం బాధ్యులైన పోలీస్ అధికారులను ఎవరిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని బోండా ఉమా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *