#Top Stories

Encounter: Huge encounter.. 18 Maoists killed..!భారీ ఎన్‌కౌంటర్.. 18 మంది మావోయిస్టులు మృతి..!

Chhattisgarh Encounter: లోక్‌సభ ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్ అరణ్యం నెత్తురోడుతోంది.. ఇటీవల కాలంలో వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్న విషయం తెలిసిందే.. తాజాగా.. మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది.

లోక్‌సభ ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్ అరణ్యం నెత్తురోడుతోంది.. ఇటీవల కాలంలో వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్న విషయం తెలిసిందే.. తాజాగా.. మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. కాంకేర్ జిల్లా మాడ్ అటవీప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భీకర ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 18 మంది మావోయిస్టులు మృతిచెందారు.. ముగ్గురు జవాన్లకు గాయాలైనట్లు పేర్కొంటున్నారు.

కాంకేర్ జిల్లా మావోయిస్టులకు ప్రాబల్యం ఉన్న ప్రాంతం.. లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు, భద్రతా బలగాలు కలిసి సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.. ఈ క్రమంలో మాడ్ అటవీ ప్రాంతంలో మంగళవారం భీకర కాల్పులు జరిగాయి. పోలీసులపైకి మావోయిస్టులు కాల్పులు జరపడంతో .. వారు కూడా ఎదురుకాల్పులు జరిపారు..

ఇంకా ఎదరుకాల్పులు కొనసాగుతున్నాయని.. ఇప్పటివరకు 10 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో పాటు.. మందుగుండు సామాగ్రి, ఏకే 47, పలు తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంటున్నారు.

ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేతలు హతమైనట్లు పేర్కొంటున్నారు.. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *