TDP : Yarapatineni Srinivasa Rao Comments On YSRCO Government : వైసీపీ అధికారంలో అరాచకాలు, దౌర్జన్యాలు : శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు


మాచవరం మండలం పిన్నెల్లి గ్రామం నందు “ప్రజాగళం – గురజాల నియోజకవర్గ ఆత్మగౌరవ సభ” లో గురజాల నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు, నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారు, జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి గారు, పార్టీ సీనియర్ నాయకులు Dr. వున్నం నాగమల్లేశ్వర రావు గారు యువ నాయకులు యరపతినేని రమేష్ గారు యరపతినేని మహేష్ పాల్గొనటం జరిగింది.

ఈ కార్యక్రమంలో గురజాల నియోజకవర్గంలోని రాష్ట్ర, పార్లమెంట్, నియోజకవర్గ, మండల, గ్రామ, వార్డు, బూత్ లెవల్ లో వివిధ హోదాలలో వున్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యువత పాల్గొనటం జరిగింది.

వైసీపీ అధికారంలో వచ్చిన వెంటనే వైసీపీ గ్రామ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలు భరించలేక తమ ఆస్తులు, భూములు బీడులు మారినా గ్రామం వదిలి ఇతర గ్రామాలకు వలసలు వెళ్లిన వందలాది కుటుంబాలు 5 ఏళ్ల తరువాత గ్రామానికి వచ్చి బిక్కు బిక్కు మంటూ భయంతో బ్రతుకుతున్న కుటుంబాలకు, ఈ సభ ద్వారా ఒక భరోసా ని ధైర్యాన్ని ఇచ్చారు.

ఎవరు అయితే ఈ 5 ఏళ్ళు వైసీపీ నాయకుల అరాచకాలకు దౌర్జన్యాల వల్ల నష్టపోయారో ప్రతీ ఒక్కరికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అన్నీ విధాలుగా ఆదుకుంటాము అని ఈ సభ ద్వారా ఒక భరోసా ఇవ్వటం జరిగింది