Hyderabad: గచ్చిబౌలి ఓయో లాడ్జిపై పోలీసుల దాడులు..

హైదరాబాద్ పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. క్రమం తప్పకుండా లాడ్జీలపై దాడులు చేస్తున్నా.. చట్టవ్యతిరేక కార్యాకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయి. పోలీసులు దాడుల్లో ఇప్పటికే ఎన్నో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఓయోలో ప్రేమ కలాపాలు జరగడం కామన్ గా మారిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. క్రమం తప్పకుండా లాడ్జీలపై దాడులు చేస్తున్నా.. చట్టవ్యతిరేక కార్యాకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయి. పోలీసులు దాడుల్లో ఇప్పటికే ఎన్నో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఓయోలో ప్రేమ కలాపాలు జరగడం కామన్ గా మారిన విషయం తెలిసిందే. అయితే కొంతమంది దళారులు అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడటంతో పాటు పేకాట ఆడుతూ పోలీసులకు దొరికిపోతున్నారు. తాజాగా గచ్చిబౌలిలోని రాజ రాజేశ్వర కాలనీ ప్రాంతంలో ఉన్న సిల్వర్ కీ ఓయో లాడ్జిలోని ఓ గదిపై గచ్చిబౌలి పోలీసులతో కలిసి సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ టీం (ఎస్ వోటీ) దాడులు చేసింది.

ఈ దాడుల్లో అక్రమ గ్యాంబ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్ వోటీ మాదాపూర్ బృందానికి అందిన సమాచారం మేరకు ఈ దాడి జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ తనిఖీల్లో నిషేధిత పేకాట ఆడుతున్న వ్యక్తులను పోలీసులు గుర్తించారు. ఈ దాడుల్లో రూ.1,52,000 నగదుతో పాటు ఏడు సెట్ల ప్లేయింగ్ కార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలి పోలీసులు ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేపట్టి అక్రమ కార్యకలాపాలకు పాల్పడిన వారిని గుర్తించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. పట్టుబడిన అనుమానితులను చట్టప్రకారం ప్రాసిక్యూట్ చేస్తామన్నారు.
ఇక ‘పందెం వేసి గెలవండి’, ‘పేకాట ఆడండి, నగదు గెలుచుకోండి’ తదితర ప్రకటనలతో దళారులు రెచ్చిపోతున్నారు. వివిధ బెట్టింగ్ మొబైల్ యాప్ల పేర్లతో ప్రచారం చేసి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. డబ్బు సంపాదించడానికి అక్రమ బెట్టింగ్ యాప్ లను వాడుతున్నారు. దీంతో లక్షల్లో డబ్బును పొగొట్టుకుంటూ అమాయకులు మోసపోతున్నారు. కాలేజీ యూత్, విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని బెట్టింగ్ ముఠా రెచ్చిపోతుండటంతో పోలీసులు నిఘా పెడుతున్నారు.