Salman khan : Gunshots at salman home : సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు…

సల్మాన్ ఖాన్‌పై హత్యాప్రయత్నం జరిగింది. ముంబైలోని అత్యంత సెక్యూరిటీ కలిగిన ప్రాంతంగా పేరున్న బాంద్రాలోని ఆయన నివాసం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి మూడు రౌండ్లు కాల్పులు జరిపడం సంచలనం రేపింది.

సల్మాన్ ఖాన్‌పై (Salman khan)హత్యాప్రయత్నం జరిగింది. ముంబైలోని అత్యంత సెక్యూరిటీ కలిగిన ప్రాంతంగా పేరున్న బాంద్రాలోని ఆయన నివాసం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి మూడు రౌండ్లు కాల్పులు (Gunshots at salman home) జరిపడం సంచలనం రేపింది. గత కొద్దికాలంగా సల్మాన్ ఖాన్‌కు ప్రాణ హాని తలపెడుతామని అగంతకులు వార్నింగ్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ఆయనకు భారీగా భద్రత ఏర్పాటు చేశారు.

ముంబై పోలీసుల కథనం ప్రకారం.. “ఇద్దరు గుర్తు తెలియని (mumbai crime branch) వ్యక్తులు బాంద్రాలోని సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపారు. మోటార్ సైకిల్స్‌పై వచ్చిన అగంతకులు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో జరిగింది. దీనిపై దర్యాప్తు జరుపుతున్నాం’’ అని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.

ఈ విషయం తెలుసుకున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సల్మాన్ ఖాన్ నివాసం గెలాక్సీ అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్నారు. ఆ ప్రాంతంలో గోడలపై ఉన్న బుల్లెట్ ఆనవాళ్లను, బుల్లెట్స్‌ను ఫోరెన్సిక్ విభాగానికి పంపినట్లు తెలిపారు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి ముప్పు ఉంది. దేశంలోనే ముప్పు ఉన్న టాప్ 10 సెలబ్రిటీలలో సల్మాన్ ఖాన్ ఒకరు అని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒకానొక సందర్భంలో వెల్లడించింది. కృష్ణ జింకలను వేటాడిన కేసులో ముద్దాయిగా ఉన్న సల్మాన్.. తమ కమ్యూనిటీ మనోభావాలను దెబ్బ తీశారనే కారణంతో గతంలో డెత్ వార్నింగ్ ఇచ్చిన సందర్భాలున్నాయి. ఇటీవల సంపత్ నెహ్రా అనే గ్యాంగ్‌స్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను విచారించగా సల్మాన్ ఖాన్‌ను చంపడానికి సుఫారీ ఇచ్చారనే విషయాన్ని ప్రాథమిక విచారణలో వెల్లడించాడు. అప్పటి నుంచి ఆయనకు మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.