#Sport News

Ankita-prathana pair that won India : భారత్‌ను గెలిపించిన అంకిత–ప్రార్థన జోడీ 

చాంగ్షా (చైనా): బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌ ఆసియా ఓసియానియా జోన్‌ మహిళల టీమ్‌ టెన్నిస్‌ టోర్నీలో భారత జట్టుకు మూడో విజయం లభించింది. దక్షిణ కొరియాతో శుక్రవారం జరిగిన నాలుగో లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 2–1తో గెలిచింది. తొలి మ్యాచ్‌లో రుతుజా భోస్లే 6–2, 6–2తో సోహున్‌ పార్క్‌పై నెగ్గి భారత్‌కు 1–0తో ఆధిక్యం అందించింది. రెండో మ్యాచ్‌లో అంకిత రైనా 2–6, 3–6తో సుజియోంగ్‌ జాంగ్‌ చేతిలో ఓడిపోవడంతో స్కోరు 1–1తో సమమైంది.

నిర్ణాయక డబుల్స్‌ మ్యాచ్‌లో అంకిత –ప్రార్థన తొంబారే ద్వయం 6–4, 6–4తో దబిన్‌ కిమ్‌–సోహున్‌ పార్క్‌ జంటను ఓడించి భారత్‌కు విజయాన్ని ఖరారు చేసింది. ఆరు జట్లు పోటీపడుతున్న ఈ టోరీ్నలో ప్రస్తుతం చైనా టాప్‌ ర్యాంక్‌లో, భారత్‌ రెండో ర్యాంక్‌లో ఉన్నాయి. నేడు జరిగే చివరి రౌండ్‌ లీగ్‌ మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌తో భారత్, కొరియాతో చైనా పోటీపడతాయి. టాప్‌–2లో నిలిచిన జట్లు వరల్డ్‌ గ్రూప్‌ ప్లే ఆఫ్స్‌ దశకు అర్హత సాధిస్తాయి.   

Leave a comment

Your email address will not be published. Required fields are marked *