Ram Charan Tej : గ్లోబల్ స్టార్ హీరో రామ్‌చరణ్ తేజ్‌కు చెన్నైలో డాక్టరేట్

గ్లోబల్ స్టార్ హీరో రామ్‌చరణ్ తేజ్‌కు చెన్నైలోని వేల్స్ యూనివర్శిటీ ఇటీవల డాక్టరేట్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొనేందకు రామ్ చరణ్ ఈ రోజు చెన్నై చేరుకున్నారు.

గ్లోబల్ స్టార్ హీరో రామ్‌చరణ్ తేజ్ (Ram Charan)కు చెన్నైలోని వేల్స్ యూనివర్శిటీ ఇటీవల గౌరవ డాక్టరేట్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. చిత్రపరిశ్రమతో పాటు సమాజానికి ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ డాక్టరేట్‌ను ప్రధానం చేయనున్నట్టు వేల్స్ విశ్వవిద్యాలయం(University of VELS) విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.
అయితే.. రామ్ చరణ్ (RamCharan) తో పాటు చంద్రయాన్-3 ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ పి.వీరముత్తువేల్, త్రివిట్రన్ హెల్త్‌కేర్ మేనేజింగ్ డైరెక్టర్, ఫౌండర్ చైర్మన్ డాక్టర్ జీఎస్కే వేలు, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ పద్మశ్రీ శరత్ కమల్ అచంటలకు కూడా ఈ గౌరవ డాక్టరేట్లను అదే వేదికపై ప్రధానం చేయనున్నారు.

ఈ రోజు ( ఏప్రిల్ 13) సాయంత్రం 4 గంటలకు చెన్నై పల్లావరంలోని వేల్స్ క్యాంపస్‌లో జరిగే యూనివర్శిటీ 14వ స్నాతకోత్సవంలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ టీజీ సీతారామ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయనున్నారు. యూనివర్శిటీ చాన్సెలర్ డాక్టర్ ఐసరి కె.గణేశ్ అధ్యక్షత వహించనున్నారు.
ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొనేందకు రామ్ చరణ్ (RamCharan) ఈ రోజు ఉదయం ఆయన సతీమణి ఉపాసన (upasana Konidela), కూతరు క్లింకారా (Klinkara Konidela) లతో కలిసి ప్రత్యేక విమానంలో చెన్నై(Chennai) చేరుకున్నారు. అక్కడ వారికి నిర్వాహులు సాదర స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.