#ANDHRA ELECTIONS #Elections

AP Politics YS.Sharmila :  మేనత్త వైఎస్ విమలపై షర్మిల సంచలన వ్యాఖ్యలు

మేనత్త వైఎస్ విమలారెడ్డిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మేనత్తకు వయసు మీద పడిందని.. అందుకే సీఎం జగన్ వైపు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలే ఎండకాలం కదా అందుకే జగన్‌కు అనుకూలంగా మాట్లాడుతూ ఉండొచ్చని స్పష్టం చేశారు.

కడప జిల్లా: మేనత్త వైఎస్ విమలారెడ్డిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల  తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘మేనత్తకు వయసు మీద పడింది. అందుకే సీఎం జగన్ వైపు మాట్లాడుతుంది. అసలే ఎండకాలం కదా అందుకే జగన్‌కు అనుకూలంగా మాట్లాడి ఉండొచ్చు. మరో ముఖ్య విషయం ఏమిటంటే.. విమలమ్మ కొడుకుకు సీఎం జగన్ పనులు ఇచ్చారు. ఆ పనులు చేయడంతో విమలమ్మ కుటుంబం ఆర్థికంగా ఎదిగింది. ఇప్పుడు మేనత్త స్థాయి వేరే. అందుకే జగన్ వైపు మాట్లాడుతున్నారు. చనిపోయింది తన సొంత అన్న అనే విషయం మరచిపోయారు అని’ షర్మిల (YS Sharmila) మండిపడ్డారు.

‘తన మేనత్త విమలమ్మకు వివేకానంద ఎంత చేశారో మరిచి పోయినట్టున్నారు. అవి గుర్తుకొస్తే ఇలా మాట్లాడారు. వివేకా హత్య కేసుకు సంబంధించి తాము ఆధారాలతో మాట్లాడుతున్నాం. దర్యాప్తు సంస్థ సీబీఐ చూపించిన ఆధారాలతో నమ్మాం. అంతే తప్ప హత్య కేసుకు సంబంధించి ఆరోపణలు చేయడం లేదు. ఆధారాలు లభించిన తర్వాత వివేకా హత్యలో అవినాష్ ప్రమేయం ఉందని విశ్వసించాం. ఇకనైనా హత్య రాజకీయాలు ఆపాలని కోరుతున్నాం. హత్య చేసిన నర హంతకులు చట్టసభల్లోకి వెళ్లకుండా పోరాడుతున్నాం అని’ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *