#Trending

Big Twist in Ex. Mla Shakeel Son car Accident Case : మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో మరో ట్విస్ట్..

మాజీ ఎమ్మెల్యే షకీల్(Shakeel) కొడుకు కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. రాహిల్‌కు(Raheel) కోర్టు బెయిల్(Bail) మంజూరు చేసింది. అయితే, రాహిల్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు(TS Police) హైకోర్టును(High Court) ఆశ్రయించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో జూబ్లీహిల్స్‌లో 2022లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసును కూడా..

హైదరాబాద్, ఏప్రిల్ 13: మాజీ ఎమ్మెల్యే షకీల్(Shakeel) కొడుకు కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. రాహిల్‌కు(Raheel) కోర్టు బెయిల్(Bail) మంజూరు చేసింది. అయితే, రాహిల్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు(TS Police) హైకోర్టును(High Court) ఆశ్రయించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో జూబ్లీహిల్స్‌లో 2022లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసును కూడా రీ ఓపెన్ చేయనున్నారు. ఈ కేసు దర్యాప్తు చేసిన అప్పటి పోలీసు అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పంజాగుట్ట కేసుమాదిరిగానే.. జూబ్లీహిల్స్ కేసులోనూ రాహిల్‌ను తప్పించారు అప్పటి పోలీసులు. తనకు బదులుగా వేరే వ్యక్తిని డ్రైవర్‌గా పంపించాడు రాహిల్. ఇప్పటికే ఈ కేసులో చార్జిషీట్ సైతం దాఖలు చేశారు పోలీసులు. చార్జిషీట్లోనూ రాహిల్‌ను తప్పించే ప్రయత్నం చేశారు అప్పటి జూబ్లీహిల్స్ పోలీసులు

అసలేం జరిగింది..

2022 మార్చ్‌లో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో కారు ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో నెలల వయసున్న చిన్నారి ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు రీ ఓపెన్ చేశాక బాధితుల స్టే‌ట్‌మెంట్‌ను పోలీసులు మరోసారి రికార్డ్ చేశారు. ఈ కేసు విచారణలో రాహిలే ప్రమాదానికి కారణం అని తేల్చారు. అయితే, జూబ్లీహిల్స్ కేసులో రాహిల్‌ను తప్పించిన అప్పటి పోలీసులపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరి పోలీసులు ఈ వ్యవహారంలో ఎలాంటి స్పెట్ తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

Big Twist in Ex. Mla Shakeel Son car  Accident Case : మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో మరో ట్విస్ట్..

South Korean singer Park Bo Ram’s Passed

Leave a comment

Your email address will not be published. Required fields are marked *