HarishRao Brs Party Mla : ఇచ్చిన హామీలు తప్పిన కాంగ్రెస్

Telangana: తెలంగాణలో మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అని ఎమ్మెల్యే హరీష్‌రావు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం కొండ భూదేవి గార్డెన్‌లో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సిద్దిపేట పట్టణ కార్యకర్తల సమావేశంలో హరీష్ పాల్గొని ప్రసంగించారు. ‘‘మనం పదేళ్లు పాలించినం… వాళ్ళు వచ్చి నాలుగు నెలలు కాలేదు.. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది’’ అని అన్నారు. సిద్దిపేటలో సగం కట్టిన వెటర్నరీ కాలేజీని రద్దు చేసి కొడంగల్‌కు రేవంత్ రెడ్డి తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిద్దిపేట, ఏప్రిల్ 12: తెలంగాణలో మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే (BRS Government) అని ఎమ్మెల్యే హరీష్‌రావు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం కొండ భూదేవి గార్డెన్‌లో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సిద్దిపేట పట్టణ కార్యకర్తల సమావేశంలో హరీష్ పాల్గొని ప్రసంగించారు. ‘‘మనం పదేళ్లు పాలించినం… వాళ్ళు వచ్చి నాలుగు నెలలు కాలేదు.. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది’’ అని అన్నారు. సిద్దిపేటలో సగం కట్టిన వెటర్నరీ కాలేజీని రద్దు చేసి కొడంగల్‌కు రేవంత్ రెడ్డి తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలని గంభీర ఉపన్యాసాలు ఇచ్చారని.. ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దగ్గర సరుకు లేదని.. పని లేదని ఎద్దేవా చేశారు. ప్రజలకు కాంగ్రెస్ మీద కోపం వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి ఓటేస్తే పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు

బీజేపీ పేదలకు, తెలంగాణకు వ్యతిరేక పార్టీ అని వ్యాఖ్యలు చేశారు. సిలేరును లాక్కుని తెలంగాణకు అన్యాయం చేసిన పార్టీ అని అన్నారు. పదేళ్లలో బీజేపీ (BJP) చేసిన ఒక్క మంచి పని ఉందా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటే అని రేవంత్ రెడ్డి బురదజల్లారని.. ఇప్పుడు బడే మియ అంటున్నారంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై తెలంగాణలో బీఆర్‌ఎస్ లేకుండా చేయాలనే కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఇంటికి రెండేడ్లు, నిరుద్యోగ భృతి ఇస్తానని, రైలు తెస్తానని అబద్ధాలు చెప్పి ఉప ఎన్నికల్లో గెలిచాలరని.. మొన్నటి ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టారన్నారు. ప్రత్యర్థుల తప్పుడు ప్రచారాలను సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలు పని చేయాలని కోరారు. బీజేపీని ఓడించే శక్తి బీఆర్‌ఎస్‌కే ఉందని ముస్లిం సోదరులు గుర్తించాలన్నారు. ఇచ్చిన హామీలు తప్పిన కాంగ్రెస్ మెడలు వంచాలంటే ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలవాలని హరీష్‌రావు పేర్కొన్నారు.