#Trending

Tamilnadu Amir Mahal-Royapettah-Chennai… బ్రిటిష్‌ కాలం నాటి నవాబుల ప్యాలెస్‌.. నేటికీ తెరుచుకోని రహస్య గదులు..!

అమీర్‌ మహల్‌ను బ్రిటీష్ వారు ఆర్కాట్‌ నవాబుకు బహుమతిగా ఇచ్చిన అప్పట్లో కేవలం 30 మంది రాజ కుటుంబీకులు మాత్రమే ఇక్కడ నివసించేవారు. కానీ ఇప్పుడు, ఆర్కాట్ యువరాజు బంధువులు, అతని సేవకులతో సహా దాదాపు 600 మంది ప్యాలెస్‌లో నివసిస్తున్నారు.

తమిళనాడు రాజధాని చెన్నై అనేక పర్యాటక ప్రదేశాలతో సందర్శకులను ఎక్కువగా ఆకర్షిస్తుంది. చెన్నై మద్రాసుగా ఉన్నప్పుడు గుర్రపు బండిలు, నిర్జన వీధులు, అందమైన రాజభవనాలు, కోటలు నగరాన్ని అలంకరించాయి. అలాంటి వాటిలో ఒకటి చెన్నై నడిబొడ్డున ఉన్న అమీర్ మహల్. చెన్నై నడిబొడ్డున ఇలాంటి ఒక ప్యాలెస్ ఉందంటే.. చూస్తే గానీ నమ్మశక్యం కాదు..? రద్దీగా ఉండే రాయపేటలో ఇంత అద్భుతమైన, ఐకానిక్ నిర్మాణాన్ని చూస్తే ఎవరికైనా సరే ఆశ్చర్యం కలుగకమానదు.

అమీర్ మహల్ 14 ఎకరాల స్థలంలో ఇండో-సార్సెనిక్ శైలిలో నిర్మించబడింది. ఈ ప్యాలెస్ మొదటి అంతస్తులో ఉన్న దర్బార్ హాలులో మాజీ నవాబుల అనేక అరుదైన పెయింటింగ్స్ కనిపిస్తాయి. అలాగే నవాబులు ఉపయోగించిన కవచాలు, తుపాకులు, పల్లకీలు ప్రదర్శించబడతాయి. ప్యాలెస్‌లో దాదాపు 80 గదులు ఉన్నాయని చెబుతారు. అయితే, ఈ ప్యాలెస్‌లో అతిథులు చూడటానికి అనుమతించని కొన్ని రహస్య గదులు కూడా ఉన్నాయని చెబుతారు.

మరో విశేషమేమిటంటే అమీర్ మహల్ లోపల చిన్న క్రికెట్ గ్రౌండ్ కూడా ఉంది. అమీర్‌ మహల్‌లోని పూర్వీకుల తైలవర్ణ చిత్రాలు, మేనా (పల్లకి), షాండిలియర్స్‌ అందాలు వర్ణనాతీతంగా కనువిందు చేస్తుంటాయి. వివిధ డిజైన్ల అందమైన షాన్డిలియర్లు అన్ని అంతస్తులలో పైకప్పు నుండి వేలాడదీయబడి కనిపిస్తుంటాయి. నేల పూర్తిగా ఖరీదైన తివాచీలతో కప్పబడి ఉంటుంది. సంవత్సరాలు గడుస్తున్నా చెక్కుచెదరని అందం అమీర్‌ మహల్‌ సొంతం.

ఆర్కాట్‌ నవాబులు సంస్కృతి, సంప్రదాయాలకే కాదు, కుల మతాలకు అతీతంగా సేవలు అందించడంలో ఆదర్శనీయులని పలువురు విశ్లేషకులు చెబుతుంటారు. చెన్నై రాయపేటలోని ఆమీర్‌ మహల్‌ ఆనాటి ఆర్కాట్‌ నవాబుల వైభవ జీవితానికి, అభిరుచులకు నిలువుట్టద్దంగా నిలుస్తూ నేటికీ వర్ధిల్లుతోంది.

అమీర్‌ మహల్‌ను బ్రిటీష్ వారు ఆర్కాట్‌ నవాబుకు బహుమతిగా ఇచ్చిన అప్పట్లో కేవలం 30 మంది రాజ కుటుంబీకులు మాత్రమే ఇక్కడ నివసించేవారు. కానీ ఇప్పుడు, ఆర్కాట్ యువరాజు బంధువులు, అతని సేవకులతో సహా దాదాపు 600 మంది ప్యాలెస్‌లో నివసిస్తున్నారు. చెన్నై రాయపేటలోని ఆమీర్‌ మహల్‌ ఆనాటి ఆర్కాట్‌ నవాబుల వైభవ జీవితానికి, అభిరుచులకు నిలువుట్టద్దంగా నిలుస్తూ నేటికీ వర్ధిల్లుతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *