#ANDHRA ELECTIONS #Elections

Congress Chief YS. SHARMILA : కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కడప జిల్లాలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

కడప లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కడప జిల్లాలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహి స్తున్నారు. దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత కూడా షర్మిలతో ప్రచారంలో పాల్గొంటున్నారు. హంతకులకు సీటు ఇవ్వడం వల్లే తాను కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారు.

కడప లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కడప జిల్లాలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత కూడా షర్మిలతో ప్రచారంలో పాల్గొంటున్నారు. హంతకులకు సీటు ఇవ్వడం వల్లే తాను కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో న్యాయం ఒకవైపు ..అధర్మం మరోవైపు ఉన్నాయని, ధర్మ పోరాటం ఒకవైపు, డబ్బు,అధికారం మరోవైపు ఉన్నాయన్నారు. కడప ఎంపీగా న్యాయం కోసం పోరాడే షర్మిలను గెలిపిస్తారా.. హంతకుడు అవినాష్ రెడ్డిని గెలిపిస్తారో ప్రజలే తేల్చుకోవాలన్నారు.

ప్రజలే నిర్ణయించుకోవాలి..

ప్రజలు తీర్పు చెప్పే సమయం ఆసన్నమయ్యిందని షర్మిల పేర్కొన్నారు. వైఎస్ఆర్, వైఎస్ వివేకా ఆత్మలు క్షోబిస్తున్నాయని, సొంత బాబాయిని నరికి చంపితే తన అన్నయ్య జగన్ హంతకులను కాపాడుతున్నారని షర్మిల ఆరోపించారు. వైఎస్సార్, వివేకానంద రెడ్డిలు ఈ జిల్లా బిడ్డలని, మేము కూడా మీ ఇంటి బిడ్డలమని షర్మిల తెలిపారు. వైఎస్ఆర్ కి ఈ గడ్డ అంటే ఎంతో ప్రేమని, జీవించినంతకాలం ఇక్కడి ప్రజల కోసమే జీవించారన్నారు. తాను ఉన్నంతకాలం ఇక్కడి ప్రజలకు సేవ చేశారన్నారు. వివేకానంద రెడ్డి సైతం ఇక్కడి ప్రజలకు సేవ చేవారన్నారు. – వైఎస్ఆర్,వివేకా వంటి నాయకులు మళ్లీ దొరకడం కష్టమన్నారు. తన బాబాయి వివేకానంద రెడ్డి గొడ్డలి పోట్లకు బలయ్యారన్నారు. వివేకానంద రెడ్డి చనిపోయి ఐదేళ్లయినా ఇంత వరకు హంతకులకు శిక్ష పడలేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా ఆత్మ ఇవాల్టికీ ఘోషిస్తుందన్నారు. హత్య చేయించింది అవినాష్ రెడ్డి అని చెప్పడానికి ఆధారాలున్నా..ఇప్పటివరకు శిక్ష పడకపోవడం దారుణమన్నారు. స్వయంగా సీఎం జగన్ హంతకులను కాపాడుతున్నారని షర్మిల ఆరోపించారు

సీఎం పదవి ఎందుకు: షర్మిల

అధికారం అడ్డుపెట్టుకొని దోషులను కాపాడుతున్నారన్నారు. హంతకులను కాపాడటానికా ప్రజలు అధికారం ఇచ్చిందంటూ ప్రశ్నించారు. ఒక్క రోజు కూడా అవినాష్ రెడ్డి జైలు కి పోలేదని, హంతకుడు దర్జాగా బయట తిరుగుతున్నారని షర్మిల విమర్శించారు. ఈ అన్యాయాన్ని తట్టుకోలేకనే వైఎస్ఆర్ బిడ్డ ఇక్కడి నుంచి పోటీ చేస్తోందన్నారు. అధర్మాన్ని ఎదురించేందుకు ఎంపీగా నిలబడ్డానని, ఒకవైపు వైఎస్ఆర్ బిడ్డ ..మరోవైపు హత్యలు చేసిన అవినాష్ రెడ్డి ఉన్నారని.. ఓటర్లు ధర్మాన్ని గెలిపించాలని ఆమె కోరారు.

సునీత ఏమన్నారంటే..

ఎంపీగా గెలిచిన వ్యక్తులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని, ప్రజల కోసం పనిచేయకుండా ఎక్కడ తిరుగుతున్నారని వివేకా కుమార్తె సునీత ప్రశ్నించారు. కడప జిల్లా ప్రజలు న్యాయం వైపు ఉన్నామా.. అన్యాయం వైపు ఉన్నామా అనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచన చేయాన్నారు. తప్పు చేసిన వాళ్లే భయపడతారని, తప్పు చేయకుంటే బయం ఎందుకని సునీత ప్రశ్నించారు. ధర్మం వైపు షర్మిల నిలబడిందని, ఆ ధర్మాన్ని, న్యాయాన్ని ప్రజలు గెలిపించాలని సునీత కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *