TDP: TDP Leader Kanna Laxminarayana నీకు ఓటు అడిగే అర్హత ఉందా?… జగన్‌పై కన్నా విసుర్లు

Andhraprdesh: ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పల్నాడులో ఏ విధంగా ఓటు అడుగుతారని ప్రశ్నిస్తూ.. జగన్‌ను ఏకిపారేశారు. పల్నాడు జిల్లాలో ముఖ్యమంత్రికి ప్రచారం చేసే అర్హత లేదని అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ..పల్నాడులో ఓటు అడిగే హక్కు జగన్‌కు లేదన్నారు. హత్యలకు అడ్డంగా పల్నాడు మారిందని.. జగన్ పాలనలో పల్నాడు అభివృద్ధి శూన్యమని విరుచుకుపడ్డారు.

పల్నాడు, ఏప్రిల్ 10: ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డిపై (CM Jaganmohan Reddy) మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ (TDP Leader Kanna Laxminarayana) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పల్నాడులో ఏ విధంగా ఓటు అడుగుతారని ప్రశ్నిస్తూ.. జగన్‌ను ఏకిపారేశారు. పల్నాడు జిల్లాలో ముఖ్యమంత్రికి ప్రచారం చేసే అర్హత లేదని అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ..పల్నాడులో ఓటు అడిగే హక్కు జగన్‌కు లేదన్నారు. హత్యలకు అడ్డంగా పల్నాడు మారిందని.. జగన్ పాలనలో పల్నాడు అభివృద్ధి శూన్యమని విరుచుకుపడ్డారు. నకరికల్లు దగ్గర పెన్నా – గోదావరి ప్రాజెక్టు నిర్మాణ నిలిపివేశారన్నారు.
వరికపూడిశెల ప్రాజెక్టుకు జగన్ మళ్లీ శంకుస్థాపన చేయటం విడ్డురమన్నారు. వైఎస్సార్ హయాంలో వరికపూడిశెల శంకుస్థాపన జరిగిందని గుర్తుచేశారు. టీడీపీ అధికారంలోకి రావటంతోనే సూపర్ 6 పధకం అమలు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఫించన్లు ఇవ్వాటానికి నగదు లేక చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓట్లు అడిగే అర్హత జగన్ లేదన్నారు. రాష్ట్రంలో అరాచక, దోపిడీ పాలన సాగుతోందన్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా, మైనింగ్, గంజాయి, దొంగ నోట్లను జగన్ ప్రోత్సహిస్తున్నారంటూ కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.