#ANDHRA ELECTIONS #Elections #Trending

AP Politics: ఏపీ రాజకీయ రణరంగంలోకి మెగాస్టార్..

మెగాస్టార్ చిరంజీవి ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా.. ఆయన ఓ ప్రధాన పార్టీకి ప్రచారం చేయబోతున్నారా.. జనసేన పార్టీ కాదని కాంగ్రెస్ కోసం ప్రచారం చేస్తారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కేంద్ర మాజీ మంత్రి అయిన చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నారని అంటున్నారు ఆ పార్టీ నాయకులు

మెగాస్టార్ చిరంజీవి ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా.. ఆయన ఓ ప్రధాన పార్టీకి ప్రచారం చేయబోతున్నారా.. జనసేన పార్టీ కాదని కాంగ్రెస్ కోసం ప్రచారం చేస్తారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కేంద్ర మాజీ మంత్రి అయిన చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నారని, రాబోయే రోజుల్లో ఆ పార్టీ తరఫున చురుగ్గా ప్రచారం చేస్తారని ఏపీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, రాజమహేంద్రవరం లోకసభ స్థానం అభ్యర్థి గిడుగు రుద్రరాజు అన్నారు. ఇటీవల ఆయన రాజమహేంద్రవరంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు చిరంజీవి రూ.5 కోట్లు విరాళంగా ఇవ్వడంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు రాజు సమాధానమిస్తూ.. చిరంజీవి సోదరుడిగా మద్దతు తెలిపినప్పటికీ, ఆయన కాంగ్రెస్ కు కట్టుబడి ఉన్నానని, పార్టీకి రాజీనామా చేయలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అభివృద్ధి చెందని ప్రాంతాలకు ఆర్థిక సాయం, ఆస్తుల సమాన విభజన అంశాలతో సహా ఏపీ పునర్విభజన చట్టం అమలు జరిగేలా చూస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ రుణాల మాఫీకి చర్యలు తీసుకుంటామని రాజు హామీ ఇచ్చారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు డి.పురంధేశ్వరి గురించి మాట్లాడుతూ.. యుపిఎ పాలనలో ఆమె మంత్రి పదవులను ప్రస్తావిస్తూ, అధికార పార్టీలతో పొత్తు పెట్టుకున్న చరిత్ర ఆమెకు ఉందని ఆయన విమర్శించారు.

అయితే రాజకీయాలు వదిలేసి దాదాపుగా సినిమాలకే పరిమితమైన చిరంజీవి ఇతర పార్టీలకు ప్రచారం చేస్తారా? అనేది ప్రశ్నగా మిగిలింది. ఎందుకంటే ఇటీవల జనసేన పార్టీకి విరాళం ఇచ్చిన మెగాస్టార్ కాంగ్రెస్ పార్టీ ఎలా ప్రచారం చేస్తారు? అని రాజకీయ విమర్శకులు అంటున్నారు. అయితే 2024 ఎన్నికలు ప్రధాన పార్టీలకు సవాల్ గా మారడంతో మెగాస్టార్ రంగంలోకి దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *