#Top Stories

Election Campaign : Young woman kiss during election campaign..ఎన్నికల ప్రచారంలో యువతికి ముద్దు.. వివాదంలో బీజేపీ అభ్యర్థి!

దేశ వ్యాప్తంగా లోక్‌ సభ ఎన్నికలకు ముమ్మర ప్రచారం సాగుతోంది. పలు పార్టీల నేతలు గడప గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్ధిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్ధులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. పోలింగ్‌కు తేదీ సమీపిస్తుండటంతో పోటాపోటీగా అధికార ప్రతిపక్షాలు ప్రచార జోరు పెంచాయి. పశ్చిమబెంగాల్‌లో ఉత్తర మాల్దా లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ ఖగేన్‌ ముర్మూ మరోసారి ఎంపీ అభ్యర్ధిగా పోటీలో ఉన్నారు…

ఏప్రిల్‌ 10: దేశ వ్యాప్తంగా లోక్‌ సభ ఎన్నికలకు ముమ్మర ప్రచారం సాగుతోంది. పలు పార్టీల నేతలు గడప గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్ధిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్ధులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. పోలింగ్‌కు తేదీ సమీపిస్తుండటంతో పోటాపోటీగా అధికార ప్రతిపక్షాలు ప్రచార జోరు పెంచాయి. పశ్చిమబెంగాల్‌లో ఉత్తర మాల్దా లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ ఖగేన్‌ ముర్మూ మరోసారి ఎంపీ అభ్యర్ధిగా పోటీలో ఉన్నారు. ఇటీవల ఆయన తన నియోజకవర్గ పరిధిలో ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. ఈ క్రమంలో చంచల్‌ శ్రిహిపూర్‌ గ్రామంలో సోమవారం ఖగేన్‌ ఓయువతి చెంపపై ముద్దు పెట్టాడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రచారంలో భాగంగా ఖగేన్‌ ముర్ము యువతికి ముద్దు పెట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ బీజేపీపై విరుచుకుపడింది. కాషాయ పార్టీలో మహిళా వ్యతిరేక రాజకీయ నాయకులకు కొదవేలేదని విమర్శలు గుప్పించారు.

‘బీజేపీ ఎంపీ, బెంగాల్‌లోని ఉత్తర మాల్దా అభ్యర్ధి ఖగేన్‌ ముర్మూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ మహిళకు ముద్దు పెట్టారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించే ఎంపీల నుంచి బెంగాలీ మహిళలపై అసభ్యకర పాటలు రాసే నేతల వరకు బీజేపీ క్యాంప్‌లో మహిళా వ్యతిరేక రాజకీయ నాయకులకు కొదవే లేదు. మహిళలకు ‘మోదీ పరివార్‌’ ఇస్తున్న గౌరవం ఇది. ఒకవేళ ఇలాంటి నేతలు అధికారంలోకి వస్తే ఇలాంటివి ఇంకెన్ని చేస్తారో ఊహించుకోండంటూ’ మండిపడింది.

ఇక తాజా వివాదంపై ఎంపీ ఖగేన్‌ స్పందించారు. ఆమెను తన కుమార్తెలా భావించి, ముద్దు పెట్టానని, పిల్లలకు ముద్దు పెడితే తప్పేంటని ప్రశ్నించారు. కుట్రపూరితంగా దీనిపై రాద్దాంతం చేస్తున్నారని, ఇలాంటి ఫొటోలను వక్రీకరించి పార్టీ పరువు తీస్తున్నారని, వారందరిపై ఫిర్యాదు చేస్తానని ఎంపీ ఖగేన్‌ వ్యాఖ్యానించారు.

Election Campaign : Young woman kiss during election campaign..ఎన్నికల ప్రచారంలో యువతికి ముద్దు.. వివాదంలో బీజేపీ అభ్యర్థి!

Harish Rao Comments On CM Revanth Reddy

Leave a comment

Your email address will not be published. Required fields are marked *