Harish Rao Comments On CM Revanth Reddy : Brs Party : నోటితో తియ్యగా మాట్లాడి నొసటితో వెక్కిరిస్తున్న రేవంత్ : హరీష్ రావు వ్యాఖ్యలు :

సంగారెడ్డి: తెలంగాణలో కాంగ్రెస్ 100 రోజుల పాలనలో అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ అభయ హస్తం అక్కరకు రాని హస్తంలాగా తయ్యారైందని ఎద్దేవా చేశారు.
కాగా, హరీష్ రావు బుధవారం సంగారెడ్డిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భండా ఆయన మాట్లాడుతూ..‘ఇటీవల కేసీఆర్ ఎండిపోయిన పంటలను పరిశీలించారు.

కేసీఆర్ సిరిసిల్లలో వడ్ల బోనస్ గురించి మాట్లాడితే సీఎం రేవంత్ రెడ్డి చెత్త పదజాలంతో ఏవోవో వ్యాఖ్యలు చేశారు. నువ్వు ముఖ్యమంత్రివా లేక చెడ్డీ గ్యాంగ్ లీడర్వా అని ప్రశ్నించారు. ఎలక్షన్స్ ముందు నోటితో తియ్యగా మాట్లాడిన రేవంత్ ఇప్పుడు నొసటితో వెక్కిరిస్తున్నారు.