#Telangan Politics #Telangana

Phone tapping case Radhakishan Rao’s remand extended : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు : రాధాకిషన్‌రావు రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి రోజుకో ట్విస్ట్‌ చోటుచేసుకుంటోంది. తాజాగా ఈ కేసు వ్యవహారంలో టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. ఈ క్రమంలో ఏప్రిల్‌ 12 వరకు రిమాండ్‌ విధించిన అనంతరం ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

కాగా, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో రాధాకిషన్‌రావుకు సంబంధించి వారం రోజుల కస్టడీ నేటితో ముగియడంతో పోలీసులు ఆయన్ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇక, విచారణ సందర్భంగా తనను జైలులో లైబ్రరీకి వెళ్లేందుకు అనుమతించడం లేదని రాధాకిషన్‌రావు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జైలు సూపరింటెండెంట్‌ను సైతం కలవనీయడం లేదని తెలిపారు.

దీంతో, పోలీసులను న్యాయమూర్తి పిలిపించి ప్రశ్నించారు. లైబ్రరీలోకి అనుమతించడంతో పాటు సూపరింటెండెంట్‌ను కలిసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం, న్యాయస్థానం ఈ నెల 12 వరకు రిమాండ్‌ను పొడిగిస్తున్నట్లు పేర్కొంది. 

ఇదిలా ఉండగా.. ఈ కేసుపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది.  ఫోన్‌ ట్యాపింగ్‌  కేసు విచారణ కోసం స్పెషల్ పీపీను ప్రభుత్వం నియమించనుంది.  పోలీసులు నెల రోజులుగా ఫోన్ టాపింగ్ కేసు విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురు అధికారులను అరెస్టు చేశారు. మాజీ డీసీపీ రాధా కిషన్ రావు, మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావులు అరెస్టు అయిన విషయం తెలిసిందే.  హై ప్రొఫైల్‌ కేసు కావడంతో ప్రత్యేక పీపీని నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం.
 

Phone tapping case Radhakishan Rao’s remand extended : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు : రాధాకిషన్‌రావు రిమాండ్‌ పొడిగింపు

Harish Rao Comments On CM Revanth Reddy

Leave a comment

Your email address will not be published. Required fields are marked *