YS Jagan-Pothina Mahesh: వైసీపీలోకి పోతిన మహేశ్..

జనసేనకు రాజీనామా చేసిన పోతిన మహేష్.. వైసీపీలో చేరారు. ఇవాళ సీఎం జగన్ సమక్షంలో పోతిన మహేష్ వైసీపీ కండువా కప్పుకున్నారు. ముందుగా.. అనుచరులతో కలిసి సీఎం జగన్ క్యాంప్ సైట్ వరకు పోతిన మహేష్ ర్యాలీ నిర్వహించారు.

జనసేనకు రాజీనామా చేసిన పోతిన మహేష్.. వైసీపీలో చేరారు. ఇవాళ సీఎం జగన్ సమక్షంలో పోతిన మహేష్ వైసీపీ కండువా కప్పుకున్నారు. ముందుగా.. అనుచరులతో కలిసి సీఎం జగన్ క్యాంప్ సైట్ వరకు పోతిన మహేష్ ర్యాలీ నిర్వహించారు. పల్నాడు జిల్లా గంటావారిపాలెంలో జగన్ క్యాంప్ సైట్‌కి ర్యాలీగా వెళ్లి.. జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. రెండు రోజుల క్రితం జనసేనకు గుడ్‌బై చెప్పారు పోతిన మహేష్.. విజయవాడ వెస్ట్ సీటు ఆశించి పోతిన మహేష్ భంగపడ్డ విషయం తెలిసిందే. మహేష్ తోపాటు.. పి.గన్నవరం జనసేన నుంచి మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాగా.. జనసేనకు గుడ్ బై చెప్పిన పోతిన మహేష్.. పవన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. సింహంలా సింగిల్‌గా వచ్చే దమ్మున్న నాయకుడితోనే తన పయనం ఉంటుందన్నారు పోతిన. జెండాకూలీలా బతకడం తన వల్ల కాదని.. వేరే పార్టీల జెండా మోసే నాయకుడితో ఉండలేనన్నారు. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడితో కలిసి పనిచేస్తానని పోతిన మహేష్ ప్రకటించారు.