#ANDHRA ELECTIONS #Elections

Andhra Pradesh:  Pothina Mahesh Accusations On Pawan Kalyan : పవన్‌ కల్యాణ్‌పై పోతిన మహేష్ సంచలన ఆరోపణలు..  

జనసేన ఆవిర్భావం నుంచి పార్టీలో కీలక నేతగా కొనసాగిన పోతిన మహేష్.. విజయవాడ పశ్చిమ స్థానం నుంచి పోటీ చేయాలని ఆశించారు. అయితే కూటమి పొత్తులో భాగంగా బీజేపీకి విజయవాడ వెస్ట్‌ కేటాయించారు. దీంతో సీటు కోసం చిన్నపాటి యుద్ధమే చేశారాయన. అనుచరులతో కలిసి రొడ్డెక్కారు. శిలువ మోసారు.. సీటు కోసం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశారు

జనసేన ఆవిర్భావం నుంచి పార్టీలో కీలక నేతగా కొనసాగిన పోతిన మహేష్.. విజయవాడ పశ్చిమ స్థానం నుంచి పోటీ చేయాలని ఆశించారు. అయితే కూటమి పొత్తులో భాగంగా బీజేపీకి విజయవాడ వెస్ట్‌ కేటాయించారు. దీంతో సీటు కోసం చిన్నపాటి యుద్ధమే చేశారాయన. అనుచరులతో కలిసి రొడ్డెక్కారు. శిలువ మోసారు.. సీటు కోసం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ అధిష్టానం మాత్రం పోతిన మొర ఆలకించలేదు. దీంతో జనసేనకు రాజీనామా చేస్తూ పవన్‌ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

నమ్మిన పార్టీ వంచించింది.. ఆస్తులమ్ముకుని కష్టపడితే అవమానాలకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు పోతిన మహేష్‌. జెండాలు మోయడానికే తాము ఉన్నామా? పార్టీకి విధేయుడిగా ఉంటే నమ్మక ద్రోహం చేస్తారా? గెలిచే పశ్చిమ నియోజకవర్గం సీటును ఎందుకు త్యాగం చేయాల్సి వచ్చింది? త్యాగాలకు బీసీలు కావాలా…కమ్మ సామజిక వర్గం పనికి రాదా? అన్ని ప్రశ్నించారు.

పోతిన మహేష్‌ వ్యాఖ్యలపై జనసేన నేత కిరణ్‌ రాయల్‌ మండిపడ్డారు. జనసేనలోకి రాకముందు, వచ్చాక మహేష్‌ క్రేజ్‌ ఎంతమారిందో తెలుసుకోవాలని సూచించారు.

రాజకీయ కుట్రలో భాగంగానే జనసేనకు టికెట్లు కేటాయింపులో అన్యాయం జరిగిందని ఆరోపించారు పోతిన మహేష్‌.

పోతిన మహేష్‌ వ్యాఖ్యలపై మండిపడ్డారు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ. సామాజిక వర్గాల వారీగా న్యాయం జరగకుంటే పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేదన్నారు.

జనసేనను వీడిన పోతిన వైసీపీలో చేరుతారనే టాక్ వినిపిస్తోంది. పోతిన కూడా చేరితే తప్పేంటని ప్రశ్నించడం అందుకు బలాన్నిచ్చింది.

పోతిన మహేష్‌కి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది జనసేన. పార్టీ పేరుని వాడుకుని అన్నిరకాలుగా లబ్ది పొందిన వ్యక్తి మహేష్‌ అని ఆరోపించారు.

ఇటు రిజైన్.. అటు కౌంటర్.. చకాచకా జరిగిపోయాయి. అయితే జనసేన నేతల అవినీతికి సంబంధించి త్వరలో నిజాలు బయటపెడతానని బాంబు పేల్చారు పోతిన. ఆ వ్యాక్యలు ఎవర్ని ఉద్దేశించి అన్నారన్నది హాట్ టాపిక్‌గా మారింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *