Love Marriage Siricilla : ప్రేమపెళ్లి…. కూతురు చనిపోయిందని ఫ్లెక్సీ కొట్టించిన తండ్రి

సిరిసిల్ల: తన కూతురు ప్రేమ పెళ్లి చేసుకొని వెళ్లిపోవడంతో ఆమె చనిపోయిందని తండ్రి ఫ్లెక్సీ కొట్టించాడు. సిరిసిల్ల పట్టణంలో చిలువేరి మురళీ కూతురు చిలువేరి అనుష బిటెక్ ఫస్టియర్ చదువుతోంది. ఒక అబ్బాయిని ప్రేమించి ఇంట్లో నుంచి పారిపోయి ప్రేమ పెళ్లి చేసుకుంది. దీంతో కూతురు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతో బిడ్డ చనిపోయిందంటూ ఫ్లెక్సీ కొట్టించి నిరసన తెలిపాడు.
ఓ దగ్గర కుమార్తె.. ఇష్టం లేని పెళ్లి చేసుకుందని పేరెంట్స్ వినూత్నంగా నిరసన తెలిపారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన చిలువేరి మురళి కుమార్తె అనూష ఓ అబ్బాయిని ప్రేమించింది. వారి ప్రేమను అనూష తల్లిదండ్రులు అంగీకరించలేదు.

సిరిసిల్ల: తల్లిదండ్రులు బిడ్డల క్షేమం కోసం అనేక త్యాగాలు చేస్తారు. వారి చదువుల నుంచి వివాహం వరకు బాగోగులు చూసుకునేది తల్లిదండ్రులే. అయితే కొన్నిసార్లు బిడ్డలు చేసే పనులు వారికి ఆగ్రహం తెప్పిస్తాయి. ఆ కోపాన్ని కొందరు బయటపెడతారు. మరికొందరు లోలోపలే దాచుకుని కుంగిపోతారు.
అయితే ఓ దగ్గర కుమార్తె.. ఇష్టం లేని పెళ్లి చేసుకుందని పేరెంట్స్ వినూత్నంగా నిరసన తెలిపారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన చిలువేరి మురళి కుమార్తె అనూష ఓ అబ్బాయిని ప్రేమించింది. వారి ప్రేమను అనూష తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించింది.
అలా బయటకి వెళ్లి ఇరువురు వివాహం చేసుకున్నారు. ఇది తెలుసుకున్న తల్లిదండ్రులు షాక్ కి గురయ్యారు. కుమార్తెతో తమ బంధం తెగిపోయిందని చెబుతూ.. ఆమె మరణ ఫ్లెక్సీని కట్టించారు. ఫ్లెక్సీ ముందు ఏడుస్తూ నిరసన తెలిపారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది.