BRS Warangal Mp Candidate : వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కోసం కేసీఆర్ కసరత్తు

వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కోసం పార్టీ అధినేత కేసీఆర్ కసరత్తు నిర్వహిస్తున్నారు. తొలుత వరంగల్ ఎంపీ టికెట్‌ను కడియం కావ్యకు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ఆమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని.. ఆ పార్టీ తరుఫున వరంగల్ నుంచి పోటీ చేస్తున్నారు.
హైదరాబాద్: వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కోసం పార్టీ అధినేత కేసీఆర్ కసరత్తు నిర్వహిస్తున్నారు. తొలుత వరంగల్ ఎంపీ టికెట్‌ను కడియం కావ్యకు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ఆమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని.. ఆ పార్టీ తరుఫున వరంగల్ నుంచి పోటీ చేస్తున్నారు. కడియం కావ్య పార్టీ మారడంతో మరో అభ్యర్థి కోసం బీఆర్ఎస్ పార్టీ తర్జన భర్జన పడుతోంది. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని నేతల అభిప్రాయాలను కేసీఆర్ తీసుకుంటున్నారు. అధిష్టానం పరిశీలనలో డాక్టర్ పుల్లా శ్రీనివాస్, డాక్టర్ సుధీర్ పేర్లున్నాయి. కేయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పుల్లా శ్రీనివాస్ పనిచేస్తున్నారు.
డాక్టర్ సుధీర్ వచ్చేసి ప్రస్తుతం హన్మకొండ జడ్పీ చైర్మన్‌గా ఉన్నాడు. ఉద్యమ కాలం నుంచి సుధీర్ పార్టీలోనే కొనసాగుతున్నారు. పుల్లా శ్రీనివాస్‌కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దాస్యం వినయ్ భాస్కర్ సపోర్ట్ చేస్తున్నారు. అధినేత ఆదేశాలతో వరంగల్ పార్లమెంట్ పరిధిలోని నియోజక వర్గాల ఇన్‌చార్జిలు ఈ రోజు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వరంగల్ ఇన్‌చార్జిలతో పల్లా రాజేశ్వర్ రెడ్డి సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశం అనంతరం పార్టీ అధినేత కేసీఆర్‌కు నేతలు నివేదిక ఇవ్వనున్నారు. ఈ నివేదిక ఆధారంగా రేపు వరంగల్ అభ్యర్థిని కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది.