#Trending

Trending News: Rats that ate 19 kg of Ganjai : 19 కేజీల గంజాయి తినేసిన ఎలుకలు!..

పబ్బుల్లో.. క్లబ్బుల్లో మత్తు కోసం కుర్రకారు వాడుతున్న గంజాయిని ఎలుకలు ఫుల్లుగా కొట్టాయి. అది కూడా అంతా ఇంతా కాదండోయ్.. ఏకంగా 19 కేజీల డ్రగ్స్‌ని ఖాళీ చేసేశాయి. ఏంటీ.. ఎలుకలు గంజాయిని కొట్టడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా?.. నమ్మలేకపోయినా ఇదే నిజమని జార్ఖండ్‌లోని ధన్‌బాద్ పోలీసులు చెబుతున్నారు. కోర్టుకు కూడా ఇదే సమాధానం ఇచ్చారు.

పబ్బుల్లో.. క్లబ్బుల్లో మత్తు కోసం కుర్రకారు వాడుతున్న గంజాయిని ఎలుకలు ఫుల్లుగా కొట్టాయి. అది కూడా అంతా ఇంతా కాదండోయ్.. ఏకంగా 19 కేజీల డ్రగ్స్‌ని ఖాళీ చేసేశాయి. ఏంటీ.. ఎలుకలు గంజాయిని కొట్టడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా?.. నమ్మలేకపోయినా ఇదే నిజమని జార్ఖండ్‌లోని ధన్‌బాద్ పోలీసులు చెబుతున్నారు. కోర్టుకు కూడా ఇదే సమాధానం ఇచ్చారు. మత్తు పదార్థాలను కలిగివున్నారనే కారణంతో డిసెంబర్ 14, 2018న శంభు అగర్వాల్ అనే వ్యక్తి, అతడి కొడుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ సందర్భంగా నిందితులు ఇద్దరినీ ధన్‌బాద్‌లోని ప్రిన్సిపల్ అండ్ సెషన్ కోర్టు జడ్జి రామ్ శర్మ ముందు పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ కేసులో జప్తు చేసిన వస్తువులు, డ్రగ్స్‌ను కూడా కోర్టుకు చూపించాలని కేసు దర్యాప్తు అధికారి జైప్రకాశ్ ప్రసాద్‌ను న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో పోలీసులు ఈ నమ్మశక్యం కాని సమాధానం ఇచ్చారు.

కోర్టు కోరిన మెటీరియల్‌ను పోలీసులు అందించలేకపోయారు. మత్తు పదార్థాలను ఎలుకలు నాశనం చేశాయంటూ రిపోర్ట్ సమర్పించారు. ఈ మేరకు ఏప్రిల్ 6న నివేదిక అందజేశారు. కాగా తన క్లయింట్‌కు శంభు, అతడి కొడుకుకి డ్రగ్స్‌తో ఎలాంటి సంబంధంలేదని నిందితుల తరపు న్యాయవాది అభయ్ భట్ వాదించారు. డ్రగ్స్ కేసు అంతా పోలీసుల కల్పితమని అన్నారు. కోర్టుకు సమర్పించిన ఆధారాల ఆధారంగా చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. జప్తు చేసిన మెటీరియల్‌ను పోలీసులు ఎందుకు సమర్పించలేకపోయారని ఆయన ప్రశ్నించారు. కాగా ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు జరపాలని ధన్‌బాద్ ఎస్పీని కోర్టు ఆదేశించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *