#Sport News

IPL -2024 Sehwag About Kohli కోహ్లి ఆ తప్పు చేయకపోయి ఉంటేనా..: సెహ్వాగ్‌


‘‘ఇలాంటి ప్రశ్నలకు జవాబు మీకు కూడా తెలుసు కదా? అయినా ప్రతిసారీ మమ్మల్నే ఎందుకు ఇలా కఠినమైన ప్రశ్నలు అడుగుతారు? మాతో బ్యాడ్‌ కామెంట్స్‌ చెప్పించాలనే కదా మీ ప్రయత్నం.

183 పరుగులు చాలా? విరాట్‌ కోహ్లి స్లోగా ఆడాడా? ఫాఫ్‌ డుప్లెసిస్‌ ఇన్నింగ్స్‌ నెమ్మదిగా సాగిందా? లేదంటే.. ఆర్సీబీ ఇంకా కనీసం 20 పరుగులు చేయాల్సిందా? ఇలాంటి ప్రశ్నలకు మీరు కూడా సమాధానం చెప్పవచ్చు’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తనకు ప్రశ్నలు సంధించిన స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌ను సరదాగా ట్రోల్‌ చేశాడు.

కావాలనే కఠినమైన ప్రశ్నలు వేసి తమను బ్యాడ్‌ చేసేందుకు చూస్తున్నారంటూ ఆటపట్టించాడు. కాగా సెహ్వాగ్‌ ప్రస్తుతం ఐపీఎల్‌-2024 కామెంటేటర్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజస్తాన్‌ రాయల్స్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య శనివారం నాటి మ్యాచ్‌ సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.

ఒక్కడే లాక్కొచ్చాడు
ఇక రాజస్తాన్‌ చేతిలో ఓటమిపాలైన ఆర్సీబీ ఇన్నింగ్స్‌ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘అవును.. ఈరోజు కోహ్లి శతకం బాదాడు. ఆర్సీబీ తరఫున ప్రస్తుతం అతడు ఒక్కడు మాత్రమే ఫామ్‌లో ఉన్నాడు.

మిగతా వాళ్లలో ఎవరూ కూడా పరుగులు చేయడం లేదు. నిజానికి కోహ్లి ఆఖరి వరకు క్రీజులో ఉండటం మంచిదైంది. మిగతా వాళ్ల నుంచి ఎటువంటి సహకారం లేకపోయినా ఒంటరిగా లాక్కొచ్చాడు.

కానీ కోహ్లి చేసిన తప్పు అదే
మాక్స్‌వెల్‌, గ్రీన్‌ అసలు ప్రభావం చూపలేదు. మహిపాల్‌ లామ్రోర్‌, దినేశ్‌ కార్తిక్‌ ఏమయ్యారో అర్థం కాలేదు. వాళ్లిద్దరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇద్దరిలో ఒక్కరు బ్యాటింగ్‌కు వచ్చినా బాగుండేది.

ఇక కోహ్లి హాఫ్‌ సెంచరీ(39 బంతుల్లో 50) తర్వాత వేగం పెంచాల్సింది. అలా చేయకుండా కోహ్లి తప్పు చేశాడు. అతడి స్ట్రైక్‌రేటు పెరిగితే ఆర్సీబీ 200 పరుగులు మార్కు చేరుకునేది ’’ అని వీరూ భాయ్‌ అభిప్రాయపడ్డాడు. 

కాగా జైపూర్‌లో రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. కోహ్లి అజేయ శతకం(113) వృథాగా పోగా.. ఆర్సీబీ ఈ సీజన్‌లో నాలుగో పరాజయాన్ని మూటగట్టుకుంది.

రాజస్తాన్‌ రాయల్స్‌ వర్సెస్‌ ఆర్సీబీ స్కోర్లు:
►వేదిక: జైపూర్‌.. సవాయి మాన్‌సింగ్‌ స్టేడియం
►టాస్‌: రాజస్తాన్‌.. బౌలింగ్‌

►ఆర్సీబీ స్కోరు:  183/3 (20)
►రాజస్తాన్‌ స్కోరు: 189/4 (19.1)

►ఫలితం: ఆరు వికెట్ల తేడాతో ఆర్సీబీపై రాజస్తాన్‌ విజయం
►ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: జోస్‌ బట్లర్‌(రాజస్తాన్‌).

Leave a comment

Your email address will not be published. Required fields are marked *