Sreeleela About Fights In Cinema : నా డ్యాన్స్ కంటే హీరోల ఫైట్లే కష్టం

‘‘ముందే అన్నీ నేర్చేసుకుని చిత్ర పరిశ్రమకి రాలేదు కానీ, ఏదైనా చేయగలననే ఓ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం నా వెంట పెట్టుకుని వచ్చా.

‘‘ముందే అన్నీ నేర్చేసుకుని చిత్ర పరిశ్రమకి రాలేదు కానీ, ఏదైనా చేయగలననే ఓ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం నా వెంట పెట్టుకుని వచ్చా. అదే నా ప్రయాణాన్ని సులభతరం చేసింది’’ అని చెబుతోంది శ్రీలీల. తొలి అడుగుల్లోనే అగ్ర కథానాయకులతో కలిసి నటించే అవకాశాల్ని సొంతం చేసుకున్న నాయిక ఈమె. డ్యాన్స్ అంటే శ్రీలీల, శ్రీలీల అంటే డ్యాన్స్ అన్నట్టుగా హీరోలకి దీటుగా ఆడిపాడుతూ తనదైన ప్రత్యేకతని చాటుతోంది. మీరు చేసే డ్యాన్సుల గురించి ప్రశంసలు విన్నప్పుడు గర్వంగా అనిపిస్తుందా? అని అడిగితే… ‘‘చిన్నప్పటి నుంచీ నృత్యంపై మక్కువ పెంచుకున్నా. నా ఆసక్తిని, అభిరుచిని మా అమ్మ ప్రోత్సహించారు. ఒక రకంగా డ్యాన్స్ పరంగా ఇప్పుడు నాకొస్తున్న గుర్తింపంతా అమ్మ, నా గురువుల చలవే. నాతోపాటు నేను చిత్ర పరిశ్రమకి తీసుకొచ్చింది నృత్యం, నృత్య ప్రదర్శనలతో నాలో పెరిగిన ఆత్మ విశ్వాసాన్నే. అదే నా బలం అని నమ్మి, ఒకొక్క సినిమాతో కొన్ని విషయాల్ని నేర్చుకుంటూ అడుగులేస్తున్నా. నా నృత్యాల కంటే కూడా, హీరోలు ఫైట్స్ కోసం పడే కష్టమే ఎక్కువ. సెట్స్‌లో వాళ్ల శ్రమ చూసి ఆశ్చర్యపోయా. అప్పుడు వాళ్లపై మరింత గౌరవం పెరిగింద’’ని చెప్పింది శ్రీలీల.