#Cinema

Ramayan Movie Shooting Updates : ‘రామాయణ్‌’ కోసం ఆస్కార్‌ విన్నర్స్‌!

బాలీవుడ్‌లో అగ్ర నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్‌ ప్రతిష్ఠాత్మకంగా ‘రామాయణం’ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే! నితేశ్‌ తివారీ దర్శకత్వంలో ‘రామాయణ’గా ఇది రానుంది.

బాలీవుడ్‌లో అగ్ర నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్‌  ప్రతిష్ఠాత్మకంగా ‘రామాయణం’ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే! నితేశ్‌ తివారీ దర్శకత్వంలో ‘రామాయణ’గా ఇది రానుంది. ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో  వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా మ్యూజిక్‌ గురించి పలు వార్తలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ చిత్రానికి ఆస్కార్‌ విజేతలను సెలెక్ట్‌ చేసుకున్నట్లు వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఏఆర్‌ రెహమాన్‌తోపాటు హాలీవుడ్‌ ఫేమస్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ హన్స్‌ జిమ్మెర్‌ దీనికి ట్యూన్స్‌ అందించనున్నారట. హన్స్‌ జిమ్మెర్‌ హాలీవుడ్‌లోని టాప్‌ సినిమాలకు సంగీతం అందించారు. ఆయనకు ఈ కథ గురించి వివరించగానే వెంటనే అంగీకరించారని.. దీని పనులు మొదలుపెట్టేందుకు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. ఇందులోని పాటలు ఎప్పటికీ గుర్తుండిపోవాలని యూనిట్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైందని పలు ఫొటోలు నెట్టింట సందడి చేశాయి.

అయితే ఈ చిత్రానికి తెలుగు వెర్షన్ మాటలు రాసే బాధ్యతను చిత్ర బృందం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు అప్పగించినట్లు సమాచారం. ఇందులో రాముడి పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌ సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్‌, హనుమంతుడి పాత్రలో సన్నీ దేవోల్‌, కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ కనిపించనున్నట్లు తెలుస్తోంది. మూడు భాగాలుగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. మొదటి పార్ట్‌ను 2025 దీపావళికి తీసుకురావాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఇక దీని వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్స్‌ కోసం నితేశ్‌ తివారీ టీమ్‌ ఆస్కార్‌ విన్నింగ్‌ కంపెనీ డీఎన్‌ఈజీతో సంప్రదింపులు జరిపిందట. ఈ చిత్రం కోసం అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీని వినియోగించాలని మూవీ యూనిట్‌ యోచిస్తోందని అందుకే లుక్‌ టెస్ట్‌ కోసం కూడా త్రీడీ టెక్నాలజీని ఉపయోగించారని టాక్‌ వినిపిస్తోంది.

రామాయణ’ కోసం తన అలవాట్లను మార్చుకున్నట్లు, కొన్ని రోజులపాటు మాంసాహారం, మద్యపానం మానేయాలని నిర్ణయించుకున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రణ్‌బీర్‌ కపూర్‌ చెప్పారు. 

Ramayan Movie Shooting Updates : ‘రామాయణ్‌’ కోసం ఆస్కార్‌ విన్నర్స్‌!

Katha Venuka Katha In OTT : ‘కథ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *