#Sport News

 IPL 2024 : Bad Experience For CSK fan : ఉప్పల్ మ్యాచ్‌లో ధోని అభిమానికి మైండ్ బ్లాంక్..

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన CSK, SRH మ్యాచ్‌లో వింత పరిస్థితి చోటుచేసుకుంది.. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఒక అభిమానికి చేదు అనుభవం ఎదురైంది. అక్షరాల 4500 పెట్టి టికెట్ కొన్న యువకుడు స్టేడియంలోకి వెళ్లగానే షాక్ తిన్నాడు. సాధారణంగానే చెన్నైతో..

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన CSK, SRH మ్యాచ్‌లో వింత పరిస్థితి చోటుచేసుకుంది.. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఒక అభిమానికి చేదు అనుభవం ఎదురైంది. అక్షరాల 4500 పెట్టి టికెట్ కొన్న యువకుడు స్టేడియంలోకి వెళ్లగానే షాక్ తిన్నాడు. సాధారణంగానే చెన్నైతో మ్యాచ్ అంటేనే అభిమానుల తాకిడి ఒక రేంజ్‌లో ఉంటుంది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌కు టికెట్ ఉన్న అభిమానుల కంటే టికెట్ లేకుండా స్టేడియం‌కు వచ్చిన అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారైనా ధోనిని ప్రత్యక్షంగా చూడాలనుకుని వచ్చేవారి సంఖ్య మరీ ఎక్కువగా ఉంటుంది. ఇక సదరు యువకుడు వేల రూపాయలు పెట్టి టికెట్ కొన్నా.. మ్యాచ్ మొత్తం నిలబడే తిలకించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉప్పల్ స్టేడియం కెపాసిటీ 39 వేలకు పైగా ఉంది. ఇందులో దాదాపు 6వేలకు పైగా టికెట్లు గ్రౌండ్ ఫ్లోర్‌కు కేటాయిస్తారు. అయితే ఈ టికెట్ ఒక్కొక్కటి 4500గా నిర్ణయించారు. ఇంత ఖర్చు పెట్టి టికెట్ కొనుగోలు చేసేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ టికెట్ కొనుక్కున్న వారు స్టేడియంలో గ్రౌండ్‌కు చాలా దగ్గరగా క్రికెట్ ప్లేయర్స్‌ను చూసే ఆస్కారం ఉంటుంది.

రూ. 4500 పెట్టి టికెట్ కొన్నాడు జునైద్ అహ్మద్ అనే వ్యక్తి. అయితే స్టేడియంకు వెళ్లి చూసేసరికి జునైద్‌కు వింత అనుభవం ఎదురయింది. 4500 రూపాయలు పెట్టి కొనుక్కున్న గ్రౌండ్ ఫ్లోర్ టికెట్‌లో సీట్ నెంబర్ సైతం కేటాయించబడుతుంది. అయితే ఇక్కడ అహ్మద్‌కు జే-66 పేరుతో సీట్ నెంబర్ కేటాయించారు. ఐదు గంటలకి ఉప్పల్ స్టేడియంకు చేరుకున్న జునైద్‌ లోపలికి వెళ్లి చూసి షాక్‌కు గురయ్యాడు. తనకి ఇచ్చిన నంబర్ సీట్ లేకపోవడంతో స్టేడియంలో ఉన్న సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. జే 65, జే 67 సీట్ నంబర్లు ఉన్నాయి.. కానీ జే 66 నంబర్ సీట్ లేదు. స్టిక్కర్ లేకపోవడంతో తీవ్ర అసహనానికి గురైన అభిమాని ట్విట్టర్ ద్వారా తన అనుభవాన్ని పంచుకున్నాడు. రూ. 4500 కొనుక్కున్నా కూడా మ్యాచ్ నిలబడి తిలకించాల్సి వచ్చింది. దీంతో హెచ్సీఏ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ నెటిజన్లతో తన అనుభవాన్ని పంచుకున్నాడు.

 IPL 2024 :  Bad Experience For CSK fan : ఉప్పల్ మ్యాచ్‌లో ధోని అభిమానికి మైండ్ బ్లాంక్..

Congress Andhra : YCP MLA Joined Congress

Leave a comment

Your email address will not be published. Required fields are marked *