IPL : Sunrisers won on Chennai: చెన్నై పై సన్‌రైజర్స్ ఘన విజయం సాధించింది

సొంతగడ్డపై సన్‌రైజర్స్ సత్తాచాటింది. హైదరాబాద్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ మెరిసింది. శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 6 వికెట్ల తేడాతో చెన్నైని ఓడించింది. మొదటి నుంచి చివరి బంతి వరకు సంపూర్ణ ఆధిపత్యం కనబరిచిన సన్‌రైజర్స్ ఈ సీజన్లో రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. సన్‌రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 165 పరుగులు సాధించింది. శివమ్ దూబె (45; 24 బంతుల్లో 2×4, 4×6) మాత్రమే ఆకట్టుకున్నాడు. అనంతరం ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అభిషేక్ శర్మ (37; 12 బంతుల్లో 3×4, 4×6) మెరుపు ఆరంభంతో మరో 11 బంతులు మిగిలివుండగానే సన్‌రైజర్స్ లక్ష్యాన్ని ఛేదించింది. 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 166 పరుగులు సాధించింది. మార్క్రమ్ (50; 36 బంతుల్లో 4×4, 1×6) అర్ధసెంచరీతో రాణించగా.. ఈ సీజన్లో మొదటి మ్యాచ్ ఆడుతున్న తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్‌రెడ్డి (14 నాటౌట్; 8 బంతుల్లో 1×4, 1×6) సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు.

చెన్నై ఇన్నింగ్స్: రచిన్ (సి) మార్క్రమ్ (బి) భువనేశ్వర్ 12; రుతురాజ్ (సి) సమద్ (బి) షాబాజ్ 26; రహానె (సి) మార్కండే (బి) ఉనద్కత్ 35; దూబె (సి) భువనేశ్వర్ (బి) కమిన్స్ 45; జడేజా నాటౌట్ 31; డరైల్ మిచెల్ (సి) సమద్ (బి) నటరాజన్ 13; ధోని నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 165; వికెట్ల పతనం: 1-25, 2-54, 3-119, 4-127, 5-160; బౌలింగ్: అభిషేక్‌శర్మ 1-0-7-0; భువనేశ్వర్ 4-0-28-1; నటరాజన్ 4-0-39-1; కమిన్స్ 4-0-29-1; మయాంక్ మార్కండే 2-0-21-0; షాబాజ్ అహ్మద్ 1-0-11-1; ఉనద్కత్ 4-0-29-1
హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (సి) రచిన్ (బి) తీక్షణ 31; అభిషేక్ శర్మ (సి) జడేజా (బి) దీపక్ చాహర్ 37; మార్క్రమ్ ఎల్బీ (బి) అలీ 50; షాబాజ్ అహ్మద్ ఎల్బీ (బి) అలీ 18; క్లాసెన్ నాటౌట్ 10; నితీష్ కుమార్ రెడ్డి నాటౌట్ 14; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (18.1 ఓవర్లలో 4 వికెట్లకు) 166; వికెట్ల పతనం: 1-46, 2-106, 3-132, 4-141; బౌలింగ్: దీపక్ చాహర్ 3.1-0-32-1; ముకేశ్ చౌదరి 1-0-27-0; తీక్షణ 4-0-27-1; తుషార్ 2-0-20-0; జడేజా 4-0-30-0; మొయిన్ అలీ 3-0-23-2; రచిన్ 1-0-3-0