#Sport News

IPL 2024 CSK vs SRH : సీఎం రేవంత్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌కు హాజరై సందడి చేశారు.

ఒకవైపు పరిపాలన వ్యవహారాలు.. మరోవైపు లోక్‌సభ ఎన్నికలు, ఇంకోవైపు శనివారం జరగబోయే తుక్కుగూడ జనజాతర సభ ఏర్పాట్లు.. ఇలా అనుక్షణం రాజకీయ కార్యకలాపాల్లో తలమునకలై ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆటవిడుపుగా.. శుక్రవారం రాత్రి ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో చెన్నై సూపర్‌కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌కు హాజరై సందడి చేశారు.

కవైపు పరిపాలన వ్యవహారాలు.. మరోవైపు లోక్‌సభ ఎన్నికలు, ఇంకోవైపు శనివారం జరగబోయే తుక్కుగూడ జనజాతర సభ ఏర్పాట్లు.. ఇలా అనుక్షణం రాజకీయ కార్యకలాపాల్లో తలమునకలై ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆటవిడుపుగా.. శుక్రవారం రాత్రి ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో చెన్నై సూపర్‌కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌కు హాజరై సందడి చేశారు. భార్య, కుమార్తె ఇతర కుటుంబసభ్యులతో కలిసి మ్యాచ్‌ ఆసాంతం వీక్షించడంతోపాటు చప్పట్లు కొడుతూ ఆటగాళ్లను ప్రోత్సహించారు.

మ్యాచ్‌ అనంతరం ఆటగాళ్లకు బహుమతుల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. అంతకు ముందు సినీనటుడు వెంకటేశ్‌, నిర్మాతలు సురేష్‌బాబు, జెమిని కిరణ్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ సీఈఓ కావ్య మారన్‌తోపాటు పలువురు క్రీడా ప్రముఖులు, కాంగ్రెస్‌ నాయకులు సీఎంకు స్వాగతం పలికారు. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *