BJP Andhra Pradesh : భాజపా అధిష్ఠానం ఆదేశాల మేరకు ప్రజల కోసం పని చేస్తా

ఎమ్మిగనూరులో భాజపా అధిష్ఠానం ఆదేశాల మేరకు ప్రజల కోసం పనిచేస్తానని ఆ పార్టీ నియోజకవర్గ బాధ్యుడు కేఆర్ మురహరి రెడ్డి అన్నారు.
ఎమ్మిగనూరు వ్యవసాయం : ఎమ్మిగనూరులో భాజపా అధిష్ఠానం ఆదేశాల మేరకు ప్రజల కోసం పనిచేస్తానని ఆ పార్టీ నియోజకవర్గ బాధ్యుడు కేఆర్ మురహరి రెడ్డి అన్నారు. శుక్రవారం భాజపా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల ఎమ్మిగనూరులో జరిగిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి తనకు పిలుపు రాలేదన్నారు.