#Top Stories

KTR satires on BJP leaders.. బీజేపీ నేతలపై కేటీఆర్‌ సెటైర్లు..

ఎలక్షన్‌ సమయం కాబట్టి ఒక పార్టీ నేత మరో పార్టీ నేతపై విమర్శలు చేసుకుంటూ ప్రచారంలో బిజీ అయిపోయారు. ఇదే సమయంలో వారు మాట్లాడే ప్రతీ మాట విషయంలో ఎంతో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. 

ఎందుకంటే ఇది సోషల్‌ మీడియా జనరేషన్‌. ఏ మూలకు చీమ చిట్టుకుమన్నా క్షణాల్లో వైరల్‌ అయిపోతుంది. దీంతో, సదరు వ్యక్తులు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలుస్తారు. ఇంతకీ ఇదంతా ఇప్పుడు ఎందుకంటే.. తాజాగా ఇద్దరు బీజేపీ నేతలు చేసిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనికి సంబంధించిన వీడియోను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. 

ఇక, ఈ వీడియోలో మన దేశ ప్రధానుల విషయమై బీజేపీ నేతలిద్దరూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలై ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ మన దేశ ప్రధాని అని చెప్పుకొచ్చారు. ఇక, ఈసారి హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి, సినీ నటి కంగనా రౌత్‌ ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మన దేశ మొదటి ప్రధాని సుభాష్‌ చంద్రబోస్‌ అని చెప్పుకొచ్చారు. దీంతో, వీరి వ్యాఖ్యలు వివాదాస్పందగా మారాయి. ఈ వీడియోను కేటీఆర్‌ షేర్‌ చేస్తూ వీరంతా ఎక్కడ చదువుకున్నారని వ్యంగ్యంగా ప్రశ్నించారు. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *