#Cinema

Ayalaan OTT Release: ఓటీటీలోకి ‘అయలాన్‌’

తమిళ హీరో శివకార్తికేయన్‌కు తెలుగులోనూ మంచి మార్కెట్‌ ఉంది. ఆయన తమిళ్‌లో నటించిన రెమో, డాక్టర్‌ వరుణ్‌, డాన్‌, ప్రిన్స్‌ చిత్రాలు తెలుగులో విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రారంభంలో ‘అయ‌లాన్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి కానుకగా రిలీజ్‌ అయిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం..టాలీవుడ్‌లో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో రిలీజైంది. సంక్రాంతికి గట్టిపోటీ ఉండటంతో అయ‌లాన్ తెలుగు రిలీజ్ వాయిదా పడిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రం ఇప్పటికే తమిళ్‌ వర్షన్‌  ఓటీటీలోకి వచ్చేసింది. భారీ ధరకు డిజిట‌ల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న సన్‌ నెక్ట్స్‌ ఫిబ్రవరిలోనే ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఓటీటీలోకి ‘అయ‌లాన్’ తెలుగు వర్షన్‌ రాబోతుందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఏప్రిల్‌ 19 నుంచి అయలాన్‌ స్ట్రీమింగ్‌ కానున్నట్లు సమాచారం.

ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది. ఆర్.రవికుమార్ దర్శకత్వం వహించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. కేవలం తమిళ్‌ వర్షన్‌లో సుమారుగా రూ. 100 కోట్ల గ్రాస్‌ను ఈ సినిమా కలెక్ట్‌ చేసింది. 

Ayalaan OTT Release: ఓటీటీలోకి ‘అయలాన్‌’

Delhi CM: Delhi cm Bail Petition :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *