A 10-year-old girl died after eating cake on her birthday బర్త్‌డే నాడు కేక్ తిని 10 ఏళ్ల బాలిక మృతి

పుట్టినరోజునాడే చిన్నారి చివరి రోజైంది. కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ అందరితో కలిసి సంతోషంగా పుట్టినరోజు జరుపుకుంది. కేరింతలు కొడుతూ ఎంతో సందడి చేసింది. ఫ్రెండ్స్ అంతా హ్యాపీ బర్త్‌డే చెబుతుండగా కేక్ కట్ చేసింది. సంతోషంగా అందరికీ కేక్ పంచింది. కేక్ తిన్న అందరూ అస్వస్థతకు గురయ్యారు. చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విచిడింది. పదో పుట్టినరోజే తన చివరి పుట్టినరోజుగా ముగిసిపోయింది
పుట్టినరోజునాడే చిన్నారి చివరి రోజైంది. కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ అందరితో కలిసి సంతోషంగా పుట్టినరోజు జరుపుకుంది. కేరింతలు కొడుతూ ఎంతో సందడి చేసింది. ఫ్రెండ్స్ అంతా హ్యాపీ బర్త్‌డే చెబుతుండగా కేక్ కట్ చేసింది. సంతోషంగా అందరికీ కేక్ పంచింది. కేక్ తిన్న అందరూ అస్వస్థతకు గురయ్యారు. చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విచిడింది. పదో పుట్టినరోజే తన చివరి పుట్టినరోజుగా ముగిసిపోయింది. ఈ విషాద ఘటన పంజాబ్‌లో చోటు చేసుకుంది. పుట్టినరోజు నాడు ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చి తెప్పించిన కేక్ తిని మాన్వీ అనే పదేళ్ల వయసున్న బాలిక చనిపోయింది. ఫుడ్ పాయిజన్ కారణంగా బాలిక ప్రాణాలు కోల్పోయి ఉంటుందని అనుమానిస్తున్నారు. పాటియాలలోని ‘కేక్ కన్హా’ బేకరీ నుంచి ఈ కేక్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చి తెప్పించినట్టు వెల్లడించాడు. కాగా మార్చి 24న రాత్రి 7 గంటల సమయంలో కేక్ కటింగ్ జరిగిందని, రాత్రి 10 గంటల సమయంలో బాలిక సహా, కుటుంబ సభ్యులంతా అస్వస్థతకు గురయ్యారని, అందరూ వాంతులు చేసుకున్నారని చెప్పాడు.