#Cinema

jr,NTR WAR-2 : ఎన్టీఆర్‌ ‘వార్‌ 2’ కోసం రంగంలోకి దిగేందుకు సమయం ఆసన్నమైంది. 

ఎన్టీఆర్‌ ‘వార్‌ 2’ కోసం రంగంలోకి దిగేందుకు సమయం ఆసన్నమైంది. అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ను యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హృతిక్‌ రోషన్‌, తారక్‌ ప్రధాన పాత్రలు పోషించనున్నారు.

న్టీఆర్‌ ‘వార్‌ 2’ కోసం రంగంలోకి దిగేందుకు సమయం ఆసన్నమైంది. అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ను యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హృతిక్‌ రోషన్‌, తారక్‌ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఈ సినిమా కోసం హృతిక్‌ ఇప్పటికే సెట్‌లోకి అడుగు పెట్టగా.. ఎన్టీఆర్‌ ఈ నెల ద్వితీయార్ధం నుంచి చిత్రీకరణలో పాల్గొననున్నారని సమాచారం. ఇది పది రోజులకు పైగా సాగే చిన్న షెడ్యూల్‌గా ఉండనున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ కూడా హృతిక్‌ తరహాలోనే స్పైగా కనిపించనున్నట్లు వార్తలొస్తున్నాయి. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్‌ – కొరటాల శివ కలయికలో రూపొందుతోన్న ‘దేవర’ ముగింపు దశ చిత్రీకరణలో ఉంది. ఇది రెండు భాగాలుగా విడుదల కానుండగా.. తొలి భాగం అక్టోబరు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *