Rashmika: పుట్టిన రోజున ‘గర్ల్‌ఫ్రెండ్’ టీజర్

‘యానిమల్’ సినిమాతో హిట్టు కొట్టి జోరు మీదుంది రష్మిక. ఇప్పుడామె రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చేస్తున్న సంగతి తెలిసిందే. విద్య కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు.
యానిమల్’ సినిమాతో హిట్టు కొట్టి జోరు మీదుంది రష్మిక. ఇప్పుడామె రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చేస్తున్న సంగతి తెలిసిందే. విద్య కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఈనెల 5న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు రాహుల్ సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ టీజర్ కోసం రష్మిక ఐదు భాషల్లో డబ్బింగ్ చెప్పినట్లు తెలిపారు. ఆమె మలయాళంలో ఇంతవరకు పని చేయకున్నా.. తొలిసారి ఆ భాషలోనూ సొంతంగా గళం వినిపిస్తున్నట్లు వెల్లడించారు. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్‌తో కలిసి ‘పుష్ప: ది రూల్’లో నటిస్తోంది. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.