#Sport News

MS Dhoni Records:  16 బంతుల్లో 37 పరుగులు.. కట్‌చేస్తే.. 3 రికార్డులు లిఖించిన జార్ఖ్ండ్ డైనమేట్..

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 13వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 191 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన సీఎస్‌కే 20 ఓవర్లలో 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో రిషబ్ పంత్ జట్టు 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 13వ మ్యాచ్ ద్వారా వింటేజ్ ధోని కనిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 8వ ర్యాంక్‌తో మైదానంలోకి వచ్చిన ధోని బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించాడు.చివరి ఓవర్లలో ధీటుగా బ్యాటింగ్ చేసిన ధోని 16 బంతుల్లో 3 భారీ సిక్సర్లు, 4 ఫోర్లతో అజేయంగా 37 పరుగులు చేశాడు. ఈ పరుగులతో ధోనీ ఎన్నో రికార్డులు కూడా నెలకొల్పాడు. ఆ రికార్డులు ఏంటో ఇప్పుడు చూద్దాం..ఈ మ్యాచ్ చివరి ఓవర్లో 2 సిక్సర్లు బాది, ఐపీఎల్ చరిత్రలోనే చివరి ఓవర్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. చివరి ఓవర్లో మొత్తం 303 బంతుల్లో 61 సిక్సర్లు ధోని బాదేశాడు.

అలాగే, ఈ మ్యాచ్‌లో అజేయంగా 37 పరుగులతో, అతను ఆసియాలో T20 క్రికెట్‌లో 7,000 కంటే ఎక్కువ పరుగులు చేసిన మొదటి వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ప్రపంచంలో మూడో ఆటగాడు కూడా. ఈ జాబితాలో క్వింటన్ డి కాక్ (8,578), జోస్ బట్లర్ (7,721) తొలి రెండు స్థానాల్లో ఉండగా, ధోనీ 7,036 పరుగులతో మూడో స్థానానికి చేరుకున్నాడు.ఈ మ్యాచ్‌లో ఒక క్యాచ్ పట్టిన ధోనీ.. టీ20 క్రికెట్‌లో 300 వికెట్లు (క్యాచ్+స్టంపింగ్) తీసిన తొలి వికెట్ కీపర్‌గా ప్రత్యేక ప్రపంచ రికార్డును లిఖించాడు.

మొత్తానికి మహేంద్ర సింగ్ 42 ఏళ్ల వయసులో అద్భుత ప్రదర్శనతో మూడు రికార్డులు నెలకొల్పాడు. అలాగే రాబోయే మ్యాచ్‌ల ద్వారా ధోనీ పేరు మీద మరిన్ని రికార్డులు చేరుతాయని భావిస్తున్నారు.

MS Dhoni Records:  16 బంతుల్లో 37 పరుగులు.. కట్‌చేస్తే.. 3 రికార్డులు లిఖించిన జార్ఖ్ండ్ డైనమేట్..

Why the delay in the investigation of

Leave a comment

Your email address will not be published. Required fields are marked *