#Telangan Politics #Telangana

KCR: KCR was angry at Revanth’s behavior.KCR వలసల రాజకీయంపై కీలక వ్యాఖ్యలు చేశారు గులాబీ బాస్.

ఎత్తండ్రా గేట్లు.. మార్చండ్రా కండువాలు.. అంటూ గాంధీభవన్‌లో ఆపరేషన్‌ ఆకర్ష్ కొత్త వెర్షన్ మొదలైందో లేదో.. అటెన్షన్‌ మోడ్‌లోకి వచ్చేసింది తెలంగాణ భవన్. వలసల రాజకీయంపై కీలక వ్యాఖ్యలు చేశారు గులాబీ బాస్. నువ్వింత చేస్తే.. నేను ఇంతకింతా చేస్తానంటూ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నంబర్‌ గేమ్‌కి చెక్ పెట్టబోయారు.

ఎత్తండ్రా గేట్లు.. మార్చండ్రా కండువాలు.. అంటూ గాంధీభవన్‌లో ఆపరేషన్‌ ఆకర్ష్ కొత్త వెర్షన్ మొదలైందో లేదో.. అటెన్షన్‌ మోడ్‌లోకి వచ్చేసింది తెలంగాణ భవన్. వలసల రాజకీయంపై కీలక వ్యాఖ్యలు చేశారు గులాబీ బాస్. నువ్వింత చేస్తే.. నేను ఇంతకింతా చేస్తానంటూ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నంబర్‌ గేమ్‌కి చెక్ పెట్టబోయారు. రేవంత్‌ యాక్షన్.. కేసీఆర్ రియాక్షన్.. తెలంగాణ పాలిటిక్స్‌లో అసలైన దంగల్ టైమ్ షురూ.

కాంగ్రెస్‌లోకి జోరుగా మొదలైంది వలసల జాతర. ఆపరేషన్ ఆకర్ష్ నయా సీజన్‌లో మోస్ట్ ఎఫెక్టివ్ పార్టీ ఏదంటే.. ఇంకేది బీఆర్‌ఎస్సే. దానం నాగేందర్‌తో మొదలై.. కడియం శ్రీహరి, కే కేశవరావులతో గేరు మార్చుకుంది. ఎక్కడికొచ్చి ఆగుతుందో అంతుబట్టని పరిస్థితి. 30 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ కాంగ్రెస్ నుంచి లీకులొస్తున్నాయి. ఈ క్రమంలో వలసలపై సీరియస్‌గా స్పందించారు గులాబీ దళపతి కె. చంద్రశేఖర్‌రావు..

చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ రేవంత్‌ తీరుపై మండిపడ్డారు కేసీఆర్. ప్రతిపక్ష పాత్ర బరాబర్ పోషిస్తం.. కాంగ్రెస్‌ ప్రభుత్వం మెడలు వంచిమరీ పనులు చేయిస్తాం.. అంటున్నారు. మళ్లీ ప్రజల మద్దతు పొందుతామని సాలిడ్ హింట్ కూడా ఇచ్చారు.

శనివారం జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి సీఎం సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. గ్రేటర్‌లో మళ్లీ పట్టు సాధించాలన్న హస్తం పార్టీ ప్రయత్నాల్లో ఇదీ ఒకటి. ఆదివారం కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య కాంగ్రెస్ పంచన చేరడంతో వరంగల్ జిల్లా రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. కానీ.. క్యాడర్ కుంగిపోకుండా జాగ్రత్త పడుతోంది బీఆర్ఎస్.

పాత నీరు పోతే కొత్త నీరు వస్తుందన్న ఆత్మవిశ్వాసంతో గంభీరంగా ముందుకెళుతోంది గులాబీ పార్టీ నాయకత్వం. ఇప్పుడు మాటల ఘాటుతో తనదైన శైలితో క్యాడర్‌కి కొత్త ఊపునిచ్చే ప్రయత్నం చేశారు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *