#Trending

Telangana Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరం..

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. మూడో రోజు తిరుపతన్న, భుజంగరావులను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ప్రశ్నిస్తున్నారు. విచారణలో మరికొందరి పేర్లను భుజంగరావు చెప్పినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ SIB కార్యాలయంతో పాటు సిటీ శివారు ప్రాంతాల్లో సర్వర్ రూమ్స్ ఏర్పాటు చేసినట్టు భుజంగరావు స్టేట్‌మెంట్‌తో.. ఆ సర్వర్ రూంలో పనిచేసిన అధికారులను దర్యాప్తు బృందం విచారణకు పిలిచింది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. మూడో రోజు తిరుపతన్న, భుజంగరావులను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ప్రశ్నిస్తున్నారు. విచారణలో మరికొందరి పేర్లను భుజంగరావు చెప్పినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ SIB కార్యాలయంతో పాటు సిటీ శివారు ప్రాంతాల్లో సర్వర్ రూమ్స్ ఏర్పాటు చేసినట్టు భుజంగరావు స్టేట్‌మెంట్‌తో.. ఆ సర్వర్ రూంలో పనిచేసిన అధికారులను దర్యాప్తు బృందం విచారణకు పిలిచింది. SIBలో పనిచేసిన మరో ముగ్గురు అధికారులను కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు పిలిచిన దర్యాప్తు బృందం.. విచారిస్తోంది.

ప్రణీత్ రావు, రాధా కిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తిరుపతన్న, భుజంగరావును అధికారులు ప్రశ్నిస్తున్నారు. SIB మాజీ డైరెక్టర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డట్టు తిరుపతన్న, భుజంగరావు చెప్పారు. అయితే కేసులో ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై దర్యాప్తు అధికారులు న్యాయ సలహా తీసుకుంటున్నారు.

మరోవైపు తిరుపతన్న, భుజంగరావు వాడిన కంప్యూటర్స్, సెల్‌ఫోన్స్ ను అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. గత ప్రభుత్వం ఎన్నికల్లో డబ్బు రవాణాకు టాస్క్ ఫోర్స్, SOT పోలీసులను వాడుకున్నట్టు దర్యాప్తు బృందం గుర్తించింది. సోమవారం నాంపల్లి కోర్టులో రాధాకిషన్ రావును వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ దర్యాప్తు బృందం పిటిషన్ వేయనుంది.

Telangana Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరం..

Sara Ali Khan : is feeding the

Leave a comment

Your email address will not be published. Required fields are marked *