Janasena pawan kalyan: నేటి నుంచి పవన్ ప్రచారం

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ శనివారం నుంచి ప్రారంభించనున్న ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ శుక్రవారం వెల్లడించారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ శనివారం నుంచి ప్రారంభించనున్న ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ శుక్రవారం వెల్లడించారు. తొలి విడతలో భాగంగా మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకు పవన్ పిఠాపురంలో పర్యటించనున్నారు. ఏప్రిల్ 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న ఎలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ గ్రామీణం, 9న పిఠాపురం, 10న రాజోలు, 11న పి.గన్నవరం, 12న రాజానగరం నియోజకవర్గాల్లో పర్యటిస్తారని మనోహర్ తెలిపారు.