#Telangan Politics #Telangana

BRS PARTY KTR:  KTR’s sensational comments on KK and Kadiam Srihari’s party change. కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే!

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కీలక నేతలు కారు దిగి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. ఈ అంశంపై పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కీలక నేతలు కారు దిగి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. ఈ అంశంపై పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేకే, కడియం ఇలాంటి నాయకులు పార్టీ కష్ట కాలంలో వదిలిపెట్టి వెళ్తున్నారని, పోయే నాయకులు వెళ్లేటప్పుడు కొన్ని రాళ్లు వేసి వెళ్తారని, అలాంటి వాళ్లు చేస్తున్న విమర్శలపైన వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నానని కేటీఆర్ అన్నారు.

పార్టీ కోసం, నాయకుల కోసం పనిచేసిన కార్యకర్తల కోసం నేను స్వయంగా వస్తానని, రానున్న స్ధానిక సంస్ధల ఎన్నికల్లో గెలిపించుకుంటానని కేటీఆర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. 2014లో విశ్వేశ్వర్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఎంపీగా చేశామని, ఆ తర్వాత 2019లో రంజిత్ రెడ్డి ని కూడా ఎంపీ చేశామని కేటీఆర్ గుర్తుచేశారు. కవిత అరెస్ట్ అయితే నవ్వుకుంటూ విమర్శలు చేస్తూ ఇతర పార్టీలకు వెళ్తున్నారని ఆరోపిస్తూ.. ఇదే మహేందర్రెడ్డి, రంజిత్ రెడ్డిలు మళ్ళీ వచ్చి కేసీఆర్ కాళ్లు పట్టుకున్న పార్టీలోకి రానీయం కేటీఆర్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.

బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ అని, ఆయన కేవలం రంగారెడ్డి మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితుడు అని, చేవెళ్లలో నిలబడ్డది కాసానికి జ్ఞానేశ్వర్ కాదు కేసీఆర్ అన్నట్టుగానే పార్టీ శ్రేణులు నిబద్ధతతో పనిచేయాలని కేటీఆర్ అన్నారు. అయితే చేవేళ్లలో వచ్చే నెలలో కేసీఆర్ బహిరంగ సభ ఉండటంతో ఎన్నికల ప్రచారాన్ని దూకుడుగా కొనసాగించాలని బీఆర్ఎస్ పార్టీ ఫిక్స్ అయ్యింది. అయితే పలువురు నేతలు పార్టీలు మారుతుండటంతో బీఆర్ఎస్ పార్టీ ఒకటి రెండు లోక్ సభ స్థానాల అభ్యర్థులను మార్చే అవకాశం ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *