Telangana: election 2024 : కారు పార్టీని ఖాళీ చేస్తున్న కాంగ్రెస్, కాషాయం..

రాజకీయాల్లో ఎలా గెలిచామన్నది కాదు..గెలిచామా లేదా అన్నదే ఆల్టిమేట్. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తోంది. కాంగ్రెస్సే కాదు.. ఆల్ పార్టీస్‌ది ఇదే లెక్కాపత్రం. గెలుపే ముఖ్యం కానీ..ఎలా గెలిస్తే ఏంటి. లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజయింది. వెంటనే కాంగ్రెస్ గేట్లు ఓపెన్ చేసింది. ఇంకేముంది అధికారం లేకపోతే కునుకు పట్టని నేతలంతా క్యూ కట్టారు.
రాజకీయాల్లో ఎలా గెలిచామన్నది కాదు..గెలిచామా లేదా అన్నదే ఆల్టిమేట్. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తోంది. కాంగ్రెస్సే కాదు.. ఆల్ పార్టీస్‌ది ఇదే లెక్కాపత్రం. గెలుపే ముఖ్యం కానీ..ఎలా గెలిస్తే ఏంటి. లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజయింది. వెంటనే కాంగ్రెస్ గేట్లు ఓపెన్ చేసింది. ఇంకేముంది అధికారం లేకపోతే కునుకు పట్టని నేతలంతా క్యూ కట్టారు. కాంగ్రెస్‌లో విలీనమైపోతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి వస్తున్న నేతలకు లెక్కాలేదు. గులాబీ బాస్‌కు అత్యంత సన్నిహితులుగా పేరుబడ్డ నాయకులు కూడా గాంధీభవన్‌కు పయనమవుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గరి నుంచి గులాబీ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. కష్టమొచ్చినా నష్టమొచ్చినా కేసీఆర్ వెంటే నడుస్తాం.. పార్టీ మారే ప్రసక్తే లేదు.. అసలు ఆ అవసరమే లేదు.. అంటూ పార్టీ మార్పు వార్తలపై స్పందిస్తూ పెద్ద పెద్ద సవాళ్లు చేస్తున్న నేతలే.. తెల్లారితే కాంగ్రెస్ కండువానో, కాషాయ కండువానో కప్పుకుని కనిపిస్తూ.. షాక్‌లమీద షాక్‌లు ఇస్తున్నారు. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతతో మొదలైన వలసల ప్రవాహం.. మెల్లమెల్లగా ఊపందుకుని.. ఇప్పుడు జోరుగా నడుస్తోంది. తాజాగా బీఆర్ఎస్‌లో కీలకంగా ఉన్న కే.కేశవరావు కూడా బీఆర్ఎస్‌కు బైబై చెప్పారు. ఆయన కూతురు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కూడా హస్తం గూటికి చేరనున్నారు. అంతేనా కడియం శ్రీహరి కుటుంబం కూడా కారుదిగింది. బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ టికెట్ కడియం కూతురు కావ్యకు ఇచ్చినా ఆమె పార్టీకి రాజీనామా చేశారు. కూతురుతోపాటు తండ్రి కూడా గులాబీకి గుడ్‌బై చెప్పేశారు. ఇలా ఫ్యామిలీ ఫ్యామిలీలు ఇప్పుడు కాంగ్రెస్ జట్టులోకి చేరడంతో కాంగ్రెస్ మరింత బలంగా తయారవుతోంది. లోక్‌సభ ఎన్నికల వేళ..ఇది కచ్చితంగా బీఆర్ఎస్‌ను దెబ్బదీసే తంత్రమే. సామాజిక వర్గాల పరంగానూ చాలా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పక్కపార్టీ నేతలను తనలో కలుపుకుంటోంది.
ఇప్పటికే చాలా మంది మాజీలు కూడా కాంగ్రెస్ కండువా కప్పేసుకుంటున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే.. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు నిజమవుతున్నట్టే కనిపిస్తున్నాయి. తాను గేట్లు తెరిస్తే.. బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందని.. కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులు ముగ్గురు నలుగురు మాత్రమే మిగులుతారని.. సంచలన స్టేట్ మెంట్ ఇచ్చారామధ్య. ఇక్కడ ఇంట్రస్టింగ్ పాయింటేంటే ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో.. బీఆర్ఎస్ నుంచి ఎవరొచ్చినా తీసుకునేది లేదని…ఆ ఇంటి మీద పిట్ట ఈ ఇంటి మీద వాలితే కాల్చేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఏకంగా గేట్లే ఎత్తేసేశారు. మరోవైపు సునీల్ కనుగోలు టీం కూడా రంగంలో దిగిందని.. పలువురు కీలక బీఆర్ఎస్ నేతలతో టచ్‌లోకి వెళ్తూ.. వారితో మంతనాలు జరుపుతోందని టాక్ నడుస్తోంది. కొంచెం పాజిటివ్ టాక్ ఉన్నా.. సోషల్ మీడియాలో వాళ్లే లీక్ చేసేసి.. వచ్చే వరకు ప్రచారం గట్టిగా నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాగైతేనేం.. తెలంగాణలో నీటి ఎత్తిపోతల పథకాలు ఎండిపోతున్నా.. నేతల ఎత్తిపోతల ప్రాజెక్టు మాత్రం కళకళలాడుతోంది. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు. చేరడమే కాదు దానంకు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కూడా కేటాయించింది.అంతేకాదు బీఆర్ఎస్ బీజేపీతో జట్టు కట్టబోతోందన్న విషయం కూడా టీవీ9బిగ్‌న్యూస్ బిగ్‌డిబేట్ లో రివీల్ చేశారు దానం