#Cinema

Arjun Das Movie: నెల రోజుల్లోపే ఓటీటీకి హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

కోలీవుడ్ యంగ్ హీరో అర్జున్ దాస్ నటించిన చిత్రం పోర్. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు బిజోయ్ నంబియార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కించారు. తమిళంతో పాటు హిందీలో ఏకకాలంలో నిర్మించారు. త‌మిళంలో అర్జున్ దాస్‌, కాళిదాస్ జ‌య‌రామ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. హిందీ వర్ష‌న్‌లో హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణే, ఎహాన్ భ‌ట్ హీరోలుగా న‌టించారు. మార్చి 1న థియేట‌ర్ల‌లో పోర్ మూవీ థియేట‌ర్ల‌లోకి వచ్చిన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. హిందీలో డంగే పేరుతో రిలీజ్ చేశారు.

తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే స్ట్రీమింగ్ అవుతోంది. శుక్రవారం నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. నెల రోజులు కూడా కాకముందే ఓటీటీకి వచ్చేసింది. ‍అయితే కేవలం తమిళం, హిందీ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే మరిన్ని భాషల్లో తీసుకొచ్చే అవకాశముంది. కాలేజీ స్టూడెంట్స్ ల‌వ్ స్టోరీస్‌, గొడ‌వ‌లు, స‌ర‌దాల‌ కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌కుడు బిజోయ్ నంబియార్ ఈ మూవీని తెర‌కెక్కించారు.  

కాగా.. గతంలో అర్జున్ దాస్ లోకేష్ క‌న‌క‌రాజ్ సినిమాతో ఫేమ్ తెచ్చుకున్నారు.. ఖైదీలో విల‌న్ గ్యాంగ్‌లో ప‌నిచేసే అండ‌ర్ క‌వ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌గా మెప్పించారు. ఆ త‌ర్వాత విజ‌య్ మాస్ట‌ర్‌తో పాటు క‌మ‌ల్‌హాస‌న్ విక్ర‌మ్‌లోనూ అర్జున్ దాస్ కనిపించారు. 

Arjun Das Movie: నెల రోజుల్లోపే ఓటీటీకి హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ANDHRA ELECTIONS : This is the situation

Leave a comment

Your email address will not be published. Required fields are marked *