#Telangan Politics #Telangana #Trending

Kadiyam Srihari – Kavya:  join Congress..! బీఆర్‌ఎస్‌కు మరో బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య..!

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఎంపీ కే కేశవరావు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించిన రోజే.. వరంగల్ బీఆర్ఎస్ లో మరో సంచలనం చోటుచేసుకుంది. వరంగల్ పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఎంపీ కే కేశవరావు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించిన రోజే.. వరంగల్ బీఆర్ఎస్ లో మరో సంచలనం చోటుచేసుకుంది. వరంగల్ పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మాజీ సీఎం కేసీఆర్ కు లేఖ కూడా రాశారు. ఆ వెంటనే.. ఢిల్లీకి పయనమయ్యారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయన కూతురు కావ్య పార్టీకి గుడ్‌బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. వారిద్దరూ కాంగ్రెస్ లో చేరేందుకు సమయత్తమయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి చేరుకున్నారు. ఏఐసీసీ పెద్దలను కలిసిన అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

కాగా.. గురువారం మాజీ సీఎం, BRS అధినేత కేసిఆర్ కు ఎంపీ అభ్యర్థి కడియం కావ్య లేఖ రాశారు. ఎంపీ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు లేఖలో తెలిపారు. బీఆర్ఎస్ పై అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా జిల్లాలో నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఎవరికి వారే యమునా తీరులా పార్టీ తయారైందని.. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ నుండి విరమించుకుంటున్నానని కావ్య పేర్కొన్నారు.

Kadiyam Srihari – Kavya:  join Congress..! బీఆర్‌ఎస్‌కు మరో బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య..!

KTR: People will protect KCR and BRS.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *