#Top Stories

Two flights Accident : ఢీకొట్టిన రెండు విమానాలు.. తప్పిన పెను ప్రమాదం..

కోల్‌కతాలో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలు ఢీకొట్టిన సంఘటన బుధవారం కోల్‌కతా విమానాశ్రయంలో చోటు చేసుకుంది. అయితే ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ రెండు విమాణాలు ఎలా ఢీకొట్టాయి.? అసలు ప్రమాదం ఎలా తప్పిందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

కోల్‌కతా విమానాశ్రయంలో రన్‌వేపై రెండు విమానాలు ఢీకొట్టాయి. బుధవారం జరిగిన ఈ సంఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లకపోవడం అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇండిగో, ఎయిర్‌ ఇండియా విమానాలు ఒకదానికి ఒకటి ఢీకొట్టాయి.

బుధవారం మధ్యాహ్నం ఇండిగో విమానం బిహార్‌లోని దర్భంగా వెళ్లడానికి క్లియరెన్స్‌ కోసం వేచి ఉంది. అయితే అదే సమయంలో ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ఆగి ఉన్న ఇండిగో విమానాన్ని ఢీకొట్టింది.

ఈ సమయంలో ఇండిగో విమానంలో ఏకంగా 135 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరితో పాటు నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ఎలాంటి ప్రమాదం జరగలేదు. తృటిలో పెను ప్రమాదం తప్పినట్లైంది.

ఇదిలా ఉంటే ఈ ఘటనపై డెరెక్టర్ జనరల్ ఆఫ్ సివల్ ఏవియేషన్ సీరియస్ అయింది. రెండు ఫ్లైట్స్ పైలట్లును విధుల నుంచి తొలగించి.. వివరణ ఇవ్వాలని కోరారు.

ఈ సంఘటనకు సంబంధించి విచారణకు ఆదేశించారు అధికారులు. ప్రమాద సమయంలో ఇండిగో విమానం ఎడమవైపు ఉన్న రెక్క విరిగిపోయింది. అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ కుడివైపు ఉన్న రెక్క ఒంగిపోయింది. ఈ సంఘటన నేపథ్యంలో కోల్‌కతా, దర్భంగా మధ్య ఇండిగో ఫ్లైట్ 6E 6152 ఆలస్యం అయింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *