#Cinema

Dil Se Soldiers… Dimak Se Saitans! దిల్‌ సే సోల్జర్స్‌… దిమాక్‌ సే సైతాన్స్!

అక్షయ్‌ కుమార్, టైగర్‌ ష్రాఫ్‌ హీరోలుగా నటించిన యాక్షన్  చిత్రం ‘బడే మియా చోటే మియా’. మానుషీ చిల్లర్, ఆలయ హీరోయిన్లుగా పృథ్వీరాజ్‌ సుకుమారన్ , సోనాక్షీ సిన్హా కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహించారు. జాకీ భగ్నానీ, వసు భగ్నాని, దీప్సిఖా దేశ్‌ముఖ్, అలీ అబ్బాస్‌ జాఫర్, హిమాన్షు కిషన్‌ మెహ్రా నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 10న విడుదల కానుంది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘ఎవరు నువ్వు..’, ‘ప్రళయం నేను..’, ‘ప్రపంచం ఇలాంటి ఓ యుద్ధాన్ని ఇప్పటివరకూ చూసి ఉండదు. మీ దగ్గర మూడే రోజులు ఉన్నాయి. మీరు ఇప్పుడు రెస్పాండ్‌ అవ్వాల్సిందే’, ‘అలాంటి ఓ సైకోని పట్టుకోవాలంటే … ఆ సైకోను మించి సైకోలుగా మేం మారాల్సిన అవసరం ఉంది’, ‘దిల్‌ సే సోల్జర్స్‌.. దిమాక్‌ సే సైతాన్స్‌ హై ఓ’ అనే డైలాగ్స్‌ ట్రైలర్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. భారతదేశాన్ని నాశనం చేయాలనుకునే ఓ సైకో సైంటిస్ట్‌ను ఇద్దరు భారత సోల్జర్స్‌ ఏ విధంగా అడ్డుకున్నారు? అన్నదే ఈ చిత్రకథ.

Dil Se Soldiers… Dimak Se Saitans! దిల్‌ సే సోల్జర్స్‌… దిమాక్‌ సే సైతాన్స్!

Shruti Haasan Dad Like Our Pair :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *