AP News Election Commission ఎన్నికల ప్రచారానికి ముందస్తు అనుమతి తప్పనిసరి.. ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు..

రాష్ట్రంలో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలతో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్ధేశం చేస్తున్నారు.
రాష్ట్రంలో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలతో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్ధేశం చేస్తున్నారు. ఇప్పటికే ఇటీవల హింసాత్మక ఘటనలు జరగడంపైనా ఎన్నికల కమిషన్ సీరియస్‌గా స్పందించింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే మూడు జిల్లాల్లో జరిగిన వయిలెన్స్‌పై సీఈఓ మీనా ఘాటుగా స్పందించారు. నంద్యాల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో జరిగిన ఘటనలకు సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లను స్వయంగా పిలిపించుకుని వివరణ కోరారు. భవిష్యత్తులో ఎక్కడా హింసాత్మక ఘటనలు జరగకుండా చూడాలని పోలీస్ అధికారులకు సూచించారు. ఇదే సమయంలో అన్ని రాజకీయ పార్టీల నేతలతో జిల్లాల ఎస్పీలు సమావేశం ఏర్పాటుచేసి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలని కూడా సూచించారు. ఎక్కడ హింస జరిగినా సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలు, సమస్మాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించిన ఎన్నికల అధికారులు ఆయా ప్రాంతాల్లో నిఘాను కట్టుదిట్టం చేసారు. అక్రమ మద్యం, నగదు అరికట్టేందుకు అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దులతో పాటు జిల్లాల్లోని కీలక ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటుచేసి తనిఖీలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా జరుపుతామని అధికారులు చెబుతున్నారు. ఇక ఎన్నికల ప్రచారంలోనూ ఎలాంటి సమస్యలు రాకుండా కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఎన్నికల కమిషన్ అధికారులు. ఎన్నికల ప్రచారం, నామినేషన్ల దాఖలుపై గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులకు ప్రత్యేకంగా వివరించారు సీఈఓ మీనా. ఎన్నికల ప్రచారానికి ముందస్తు అనుమతి తప్పనిసరని స్పష్టం చేసారు.
ఆన్‌లైన్ అనుమతులు, నామినేషన్లు, అఫిడవిట్ల దాఖలు కోసం..
ఎన్నికలకు మరో 50 రోజులు సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది. ఇప్పటికే అభ్యర్ధులు ప్రచారం కూడా మొదలుపెట్టేసారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉంటంతో రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. అందుకే రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు నిర్వహించే సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు, ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీ వంటి ప్రచార కార్యక్రమాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని రాజకీయ పార్టీల నాయకులకు మీనా సూచించారు. ముందస్తు అనుమతి కొరకు సువిధా పోర్టల్‌ను వినియోగించుకోవాలని తెలిపారు. అనుమతి కోసం 48 గంటలకు ముందుగానే సువిధా యాప్ ద్వారా లేదా నేరుగా సంబందిత రిటర్నింగ్ అధికారికి ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని మీనా తెలిపారు. మరోవైపు ఎన్నికల్లో ఈసారి ఆన్‌లైన్ ద్వారా కూడా నామినేషన్‌లు దాఖలు చేసే అవకాశం ఇచ్చారు. ఆన్లైన్ నామినేషన్లు, అఫిడవిట్‌లను దాఖలు చేసేందుకు కూడా సువిధా పోర్టల్‌ను ఈసీఐ డిజైన్ చేసినట్టు సీఈఓ చెప్పారు. ఎక్కడా ఎన్నికల కోడ్ ఉల్లంఘించకుండా ప్రశాంత వాతావరణంలో ప్రచారం జరుపుకోవాలని సూచించారు.