#ANDHRA ELECTIONS #Elections

CM Jagan: YS Jagan enters the election battleground.. ఎన్నికల రణరంగంలోకి వైఎస్ జగన్.. బస్ యాత్రపై భారీ అంచనాలు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల రణరంగంలో దిగనున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో నేరుగా ప్రజా క్షేత్రంలో ప్రచారానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడుగుపెట్ట బోతున్నారు. దీనితో వైఎస్ ఎన్నికల క్యాంపెయిన్ పై ఎపి పాలిటిక్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల రణరంగంలో దిగనున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో నేరుగా ప్రజా క్షేత్రంలో ప్రచారానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడుగుపెట్ట బోతున్నారు. దీనితో వైఎస్ ఎన్నికల క్యాంపెయిన్ పై ఎపి పాలిటిక్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బస్ యాత్ర వేదికగా వైఎస్ జగన్ పార్టీలో సరికొత్త జోష్ నింపబోతున్నారు. ఎపిలో ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే అభ్యర్థుల తుది జాబితా విడుదల చేసిన వైసీపీ అధినేత రాష్ట్ర వ్యాప్తంగా బస్ యాత్ర ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఎపిలో ఇటివల వైసీపీ భారీ ఎత్తున నిర్వహించిన సిద్ధం సభలకు కొనసాగింపుగా వైఎస్ జగన్‌ బస్సు యాత్ర ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే న్నికల షెడ్యూల్‌ విడుదలకి ముందు 4 సిద్ధం సభలను లక్షలాది మంది పార్టీ కార్యకర్తలతో భారీ ఎత్తున నిర్వహించింది వైసీపీ.

ఇక ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో అదే జోష్ కొనసాగింపుగా బస్సు యాత్ర చేపడుతున్నారు వైఎస్ జగన్, ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకూ ఈ బస్సు యాత్ర నిర్వహించాలని వైసీపీ ఇప్పటికే షెడ్యూల్ ఫిక్స్ చేసింది. ఇక ఇప్పటికే నిర్వహించిన సిద్ధం సభల గ్రాండ్ సక్సెస్ కావడం జాతీయ స్థాయిలో పెద్ద చర్చ జరుగుతోంది. ఇక క్షేత్రస్థాయిలో మేం సిద్ధం, మా బూత్‌ సిద్ధం అని బూత్‌ స్థాయిలో పార్టీ నేతల్లో జోష్ నింపింది వైసీపీ. వైఎస్ జగన్ ఇడుపులపాయ నుంచి బస్సు యాత్రను ప్రారంబించ బోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ క్యాడర్,లీడర్ వరకు అందరిని ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం కావాలని డిక్లేర్‌ చేసేలా బస్ యాత్ర ఉండబోతుంది. బస్ యాత్ర వచ్చే 18వ తేదీ వరకూ కొనసాగే అవకాశం ఉంది.

ఇక సిద్ధం సభలు జరిగిన నాలుగు నియోజకవర్గాలు పోను మిగిలిన నియోజకవర్గాలన్నీ కలిసి వచ్చేలా బస్సు యాత్ర ప్లాన్‌ జరిగేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తుంది వైసీపీ. 2019 ఎన్నికలముందు జరిగిన వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర తరహాలోనే 2024 ఎన్నికలకు నెల రోజుల ముందు మేమంతా సిద్ధం పేరుతో బస్ యాత్ర జరగనుంది. వైఎస్ నేరుగా పూర్తిగా బస్ యాత్రలోనే ఉండటంతో పాటు పండుగలు, సెలవులు వచ్చినా ఆయన అక్కడే బస చేసేలా వైసీపీ ఏర్పాట్లు చేసింది. బస్సు యాత్రలో మొదటిరోజు ఇడుపుల పాయలో వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించి సాయంత్రం ప్రొద్దుటూరు చేరుకుని అక్కడ తొలి మేమంతా సిద్ధం సభలో సిఎం జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఐదేళ్ల పాలనలో సలహాలు, సూచనలను ఆయా వర్గాల నుంచి వైఎస్ జగన్ అడిగి తెలుసుకోనున్నారు. ఇక బస చేసిన ప్రాంతాల్లోనే ఆయా జిల్లాల్లోని ముఖ్య నేతలు కార్యకర్తలతో వైఎస్ జగన్ భేటీ అవుతారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, నియోజకవర్గ పరిధిలో నేతల మధ్య ఉన్న వివాదాలకు చెక్ పెట్టేలా వారితో చర్చించడంతో పాటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు.

ప్రస్తుతం ముడు రోజుల పాటు మాత్రమే షెడ్యూల్ ఫిక్స్ అయిన నేపథ్యంలో మొదటి రోజు ప్రొద్దుటూరులో, రెండో రోజు ఉదయం నంద్యాల, అళ్లగడ్డ ఇంటరాక్షన్, సాయంత్రం నంద్యాలలో సభ. మూడో రోజు కర్నూలు పార్లమెంటు పరిధిలోనీ ఎమ్మిగనూరు సభలో వైఎస్ జగన్ ప్రసంగం ఉండబోతుంది. మొత్తానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల అవ్వడంతో వైఎస్ నేరుగా ఎన్నికల రణరంగంలో దిగనున్నారు. చూడాలి మరి వైఎస్ జగన్ చేపడుతున్న బస్ యాత్ర ఎలా ఉండబోతుందో!

CM Jagan: YS Jagan enters the election battleground.. ఎన్నికల రణరంగంలోకి వైఎస్ జగన్.. బస్ యాత్రపై భారీ అంచనాలు

ANDHRA : Third list of TDP.. Discontent

Leave a comment

Your email address will not be published. Required fields are marked *