#Trending

Viral Video: Chane snatching on road : రోడ్డుపై మహిళ.. రెప్పపాటులో మెడలోని బంగారు గొలుసు మాయం!

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. రోడ్డు పక్కన సోషల్ మీడియా కోసం రీల్‌ను చేస్తుండగా బైక్‌పై వచ్చిన వ్యక్తి చైన్‌తో పరారయ్యాడు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. రోడ్డు పక్కన సోషల్ మీడియా కోసం రీల్‌ను చేస్తుండగా బైక్‌పై వచ్చిన వ్యక్తి చైన్‌తో పరారయ్యాడు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంతమంది దీనిని రీల్ పిచ్చి అంటుంటే, మరికొందరు లా అండ్ ఆర్డర్‌పై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, రోడ్డు పక్కన ఒక మహిళ సెల్‌ఫోన్‌లో రీల్‌ షూట్ చేసుకుంటోంది. ఆమె నెమ్మదిగా కెమెరా వైపు వస్తుండగా, ఓ బైక్ రైడర్ వచ్చి మహిళ మెడలోని గొలుసు లాక్కొని పారిపోయాడు. వీడియోను చూడగానే అది రీల్‌లో భాగమైనట్లు కనిపించింది కానీ, మహిళ భయంతో కేకలు వేయడంతో అది స్నాచింగ్‌ ఘటన అని వెలుగులోకి వచ్చింది.

హెల్మెట్‌ ధరించి బైక్‌పై వచ్చిన అగంతకుడు మహిళ పక్కకు వచ్చి చైన్‌ లాగి వేగంగా అక్కడి నుంచి పారిపోయాడు. అగంతకుడు.. కెమెరాలో ఉన్న మహిళ మెడలో నుంచి మంగళసూత్రాన్ని, బంగారు గొలుసును ఎత్తుకెళ్లాడు. పట్టపగలు రోడ్డుపై చైన్ స్నాచింగ్‌ల ఈ ఘటనను చూసి ప్రజలు శాంతిభద్రతలపై ప్రశ్నలు లేవనెత్తుతుండగా, ఈ రోజుల్లో ప్రజలు తమ చుట్టూ ఏమి జరుగుతుందో కూడా తెలుసుకోలేని విధంగా రీల్స్‌తో బిజీగా ఉన్నారని కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు.

Viral Video: Chane snatching on road :  రోడ్డుపై  మహిళ.. రెప్పపాటులో మెడలోని బంగారు గొలుసు మాయం!

TRENDING : see that he moved the

Viral Video: Chane snatching on road :  రోడ్డుపై  మహిళ.. రెప్పపాటులో మెడలోని బంగారు గొలుసు మాయం!

The son who peeled off his skin

Leave a comment

Your email address will not be published. Required fields are marked *